గురు బలంతో వారికి స్థిరాస్తులు, స్వగృహ యోగం..! ఇందులో మీ రాశి ఉందా..?

Edited By:

Updated on: May 28, 2026 | 11:56 AM

Jupiter Transit 2026: జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచరించే గురుగ్రహం ప్రభావంతో మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఆస్తి, సంపదల విషయంలో శుభఫలితాలు కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తులు, చరాస్తులు పెరగడం, గృహ యోగం కలగడం, ఆస్తి వివాదాలు మరియు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం కావడం వంటి ప్రయోజనాలు పొందవచ్చు. సంపద కారకుడైన గురువు అనుగ్రహంతో ఆర్థిక స్థిరత్వం, ఐశ్వర్యం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

1 / 8
ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు గురువు కొన్ని రాశులకు ఐశ్వర్యాన్ని, సిరిసంపదలను కలిగించే అవకాశం ఉంది. సగటు వ్యక్తి కూడా సంపన్నుడు అవడం జరుగుతుంది. గురువు సంపదకు కారకుడైనందువల్ల ఆస్తి లాభం, భూలాభం వంటివి కూడా కలుగుతాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేయబోతున్న గురువు వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి స్థిరాస్తులు, చరాస్తులు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. గృహ యోగం కలుగుతుంది.

2 / 8
మేషం: ఆస్తిపాస్తులు, సొంత ఇల్లు, వాహనం వంటి అంశాలకు సంబంధించిన చతుర్థ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం ప్రారంభిస్తున్నందు వల్ల ఈ రాశివారికి ఈ విషయంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో సొంత ఇల్లు అమరుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. అనేక విధాలుగా చర, స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

3 / 8
మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలోకి వస్తున్నందు వల్ల ఈ రాశివారికి తప్పకుండా గృహ యోగం కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల స్థలాలు, పొలాల మీద బాగా పెట్టుబడులు పెట్టే సూచనలున్నాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. అపర కుబేర యోగం పట్టే అవకాశం ఉంది. జీవనశైలిలోనూ, స్థితిగతుల్లోనూ ఊహించని మార్పు చోటు చేసుకుంటుంది.

4 / 8
కర్కాటకం: ఈ రాశిలో ధన కారకుడు గురువు ఉచ్ఛపడుతున్నందు వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా లక్ష్మీకటాక్షం లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. స్థలాల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారు బాగా లబ్ధి పొందు తారు. కొద్ది ప్రయత్నంతో సొంత ఇల్లు అమరుతుంది. వాహన యోగానికి కూడా అవకాశం ఉంది.

5 / 8
కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితికి వస్తున్నందు వల్ల ఈ రాశివారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తిపాస్తుల విలువ బాగా పెరగడం, చరాస్తులు కూడా వృద్ధి చెందడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వల్ల దశ తిరుగుతుంది.

6 / 8
వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందు వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందడం వల్ల స్థలాలు ఎక్కువగా కొనడం జరుగుతుంది. ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లలో ఆదాయాన్ని మదుపు చేయడంతో పాటు లాటరీ టికెట్లు కొనడం కూడా మంచిది.

7 / 8
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలోకి వస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా ఆస్తిపరులయ్యే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచే కాక, జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా ఆస్తి కలిసి వస్తుంది. అనేక విధాలుగా స్థిర, చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రభుత్వం నుంచి ధన లాభం, ఆస్తి లాభం కలిగే అవకాశం కూడా ఉంది. రావలసిన సొమ్మును రాబట్టుకుని షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెడతారు.

8 / 8
మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితికి వస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా సంపన్నులయ్యే అవకాశం ఉంది. లాభసాటిగా, సానుకూలంగా ఆస్తి ఒప్పందాలు, గృహ ఒప్పందాలు కుదురుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల సంపద బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. స్థలాలు, భూముల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది.

Follow Us