Trigraha Yoga: అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!

Edited By:

Updated on: Jul 31, 2026 | 6:07 PM

Telugu Astrology: ఆగస్టు 5 నుంచి 17, 2026 వరకు కర్కాటక రాశిలో గురుడు, బుధుడు, రవి కలిసి సంచరించడం వల్ల అరుదైన శుభ గ్రహయోగం ఏర్పడనుంది. ఈ యోగం ప్రభావంతో మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి కెరీర్, ఆర్థికం, కుటుంబం, వ్యక్తిగత జీవితంలో అదృష్ట యోగాలు, కీలక సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

1 / 7
జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు, బుధులు కలిసినా, గురు రవులు కలిసినా, రవి, బుధులు కలిసినా అదృష్ట యోగాలు పట్టే అవకాశం ఉంటుంది. ఈ రకమైన గ్రహాల కలయిక జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది.. ఆగస్టు 5 నుంచి 17 వరకు కర్కాటక రాశిలో గురు, బుధ, రవులు కలిసి ఉండి, కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక సానుకూల మార్పులు, అదృష్ట యోగాలను తీసుకురాబోతున్నాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి ఉన్నత స్థితిగతులు కలిగే అవకాశం ఉంది. ఈ మూడు గ్రహాల అపూర్వ కలయిక వల్ల వీరికి సిరిసంపదలు, భోగభాగ్యాలు వృద్ధి చెందే అవకాశం ఉంది.

2 / 7
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో రవి, బుధులు కలవడం వల్ల ఉద్యో గంలో పదోన్నతులతో  పాటు జీతభత్యాలు, అదనపు ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి ఎంతో ఉపశమనం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.

3 / 7
మిథునం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడితో గురు రవులు కలవడం వల్ల అరుదైన రాజయోగం పడుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.

4 / 7
కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో రవి, బుధులు కలవడం వల్ల పన్నెండు రోజుల పాటు ఈ రాశివారి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో తప్పకుండా హోదా, స్థాయి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా పుంజు కుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి కూడా బాగా లాభిస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి.

5 / 7
కన్య: రాశినాథుడు బుధుడు లాభ స్థానంలో గురు రవులతో యుతి చెందడం వల్ల ఈ రాశివారికి రాజ యోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి.. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి, వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట లభిస్తుంది.

6 / 7
తుల: ఈ రాశికి దశమ స్థానంలో శని, బుధ, రవుల యుతి జరగడం వల్ల విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.  ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి, వ్యాపారాల్లో లాభాల పెరుగుదలకు అవకాశం ఉంది. విశేషమైన ధన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. ప్రతిభాపాటవాలు, సమర్థత బాగా వెలుగులోకి వస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.

7 / 7
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ త్రిగ్రాహి యోగం ఏర్పడుతున్నందువల్ల  ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us