June 2026 Horoscope: ఆ రాశుల వారికి ఆర్థికంగా గోల్డెన్ టైమ్.. 12 రాశుల వారికి మాసఫలాలు

Edited By:

Updated on: May 31, 2026 | 7:58 PM

మాస ఫలాలు (జూన్ 1-30, 2026): మేష రాశి వారు ఈ నెలలో ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మరింతగా బలపడుతుంది. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి జూన్ 2026 మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురువు, శుక్రుడు, రవి గ్రహాలతో పాటు రాశ్యధిపతి కుజుడు కూడా బాగా అనుకూల సంచారం చేస్తుండడం వల్ల ఈ నెలంతా చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. సుఖాలు, సౌకర్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. పిల్లల బాగోగుల విషయంలో శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. కెరీర్ లో ఆశించిన పురోగతి ఉంటుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. విదేశీ సంబంధమైన వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. ప్రేమ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడికి తృతీయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో యుతి కలుగుతున్నందువల్ల ఈ నెలంతా విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. లాభ స్థానంలో ఉన్న శని వల్ల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా బలపడుతుంది. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బంధుమిత్రుల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వినడం జరుగుతుంది. తృతీయ స్థానం బలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధించడం, ఆర్థిక, వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వినడం, స్థిరత్వం లభించడం వంటివి జరుగుతాయి. వృత్తి జీవితం నిలకడగా ముందుకు సాగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు ఇది బాగా కలిసి వచ్చే కాలం. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. పిల్లలకు శ్రమ పెరుగుతుంది.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): నెలంతా సానుకూలంగా గడిచిపోతుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత యోగదాయకంగా ఉంటుంది. ధన స్థానంలో గురు, శుక్రుల కలయిక వల్ల జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇంట్లో ముఖ్యమైన సౌకర్యాలన్నీ అమరుతాయి. దైవ కార్యాలు, శుభ కార్యాల మీద ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. విదేశీ సంబంధమైన విషయాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. స్వల్ప ప్రయత్నంతో అధిక లాభాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశిలో గురువు ఉచ్ఛపడుతుండడంతో పాటు, కుజ, రవుల అనుకూలత వల్ల నెలంతా విజయాలతో సాగిపోతుంది. ద్వితీయార్థం కంటే ప్రథమార్థం చాలా బాగుంటుంది. ముఖ్యమైన పనులన్నీ సునాయాసంగా పూర్తయి మానసికంగా ఊరట లభిస్తుంది. శని భాగ్య స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. సమాజంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారు విశేషమైన ప్రయో జనాలు పొందుతారు. రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, బంధు మిత్రులలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు తగ్గిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. సహోద్యోగులతో అపార్థాలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవితో పాటు కుజ, బుధులు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. శత్రువులు కూడా మిత్రు లుగా మారి సహాయపడతారు. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొద్దిగా ఆలస్యం గానే అయినా ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. అష్టమ శని ప్రభావం వల్ల తరచూ అనారోగ్యానికి గురి కావడం, అనుకోని ఖర్చులు పెరగడం వంటివి జరుగుతాయి. ఎటు వంటి సమస్య అయినా కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. తండ్రి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నా అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం అందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ముందుకు దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): భాగ్య స్థానంలో సంచరిస్తున్న రాశ్యధిపతి బుధుడి వల్ల, లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వల్ల నెలంతా ఆర్థికంగా బాగా గడిచిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. రుణ సమస్యలు తగ్గిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశాంత పరిస్థితులు నెల కొంటాయి. పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. లాభ స్థానంలో ఉన్న శుభ గ్రహాల వల్ల ఆదా యం దినదినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సప్తమ శని వల్ల ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు. తరచూ అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామి తరఫు నుంచి సంపద పెరుగుతుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): నెలంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న గురువు, భాగ్య, దశమ స్థానాల్లో సంచారం చేస్తున్న శుక్ర, బుధుల వల్ల అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ఏ పని చేసినా చెల్లుబాటవుతుంది. ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగు తాయి. రాజ యోగాలు పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి మాట చెల్లుబాటు కావడం, వీరి సలహాలు, సూచనలతో పాటు, వీరి పనితీరు కూడా అధికారులకు నచ్చడం వంటివి జరుగు తాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం, ఇతరులకు సహాయం చేయడం వంటివి చోటుచేసుకుంటాయి. వ్యాపారాల్లో భాగస్వాములతో వృత్తి, ఉద్యోగాల్లో సహచరులతో కొద్దిగా సమస్యలుండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు స్వస్థానంలో బాగా అనుకూలంగా ఉండడంతో పాటు, భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారమవుతుంది. చిన్నాచితకా సమస్యలున్నా మొత్తానికి నెలంతా సానుకూలంగానే సాగిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభించడం, ప్రాభవం పెరగడం, గుర్తింపు రావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి, ఉద్యోగం మారడానికి అవకాశాలు బాగా మెరుగ్గా ఉన్నాయి. వ్యాపారాలు కూడా లాభాలపరంగా నిలకడగా పురోగమిస్తాయి. వృత్తి జీవితంలో క్షణం తీరిక ఉండని పరిస్థితి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికీ మానసికంగా ఆందోళన చెందడం మంచిది కాదు. పంచమ స్థానంలో ఉన్న శని వల్ల ఒత్తిడి, వ్యయ ప్రయాసలుంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రవి, కుజ, బుధ, రాహువుల అనుకూలత వల్ల నెలంతా చాలావరకు శుభప్రదంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అష్టమ స్థానంలో రాశ్యధిపతి గురువు ఉచ్ఛ పట్టడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది కానీ, ఆర్థిక విషయాల్లో ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడతారు. అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆర్థికపరంగా కూడా ప్రతి ప్రయత్నం సానుకూల ఫలితానిస్తుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరగడానికి, అదృష్ట సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయ వృద్ధి ఉంటుంది. అయితే, శని, శుక్రుల కారణంగా అనవసర ఖర్చులు పెరగడం, తరచూ విమర్శలకు గురి కావడం జరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశివారికి ఈ నెలంతా వైభవంగా సాగిపోతుంది. ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. గురు బలం పెరగడంతో పాటు శని, శుక్ర, బుధ గ్రహాల అనుగ్రహం కూడా కలిగినందువల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో మాత్రం చిన్నాచితకా సమస్యలుంటాయి. ప్రతి ముఖ్యమైన ఆర్థిక వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. క్రమంగా ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంటుంది. గృహ, వాహన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. తరచూ మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సహోద్యోగులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. పిల్లలు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): శుభ గ్రహాల అనుకూలత బాగా తగ్గినందువల్ల ఎక్కువగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో శ్రమ బాగా పెరుగుతుంది. ఆదాయంతో సమానంగా ఖర్చులు వృద్ధి చెందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు యథాతథంగా కొనసాగుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఒకటి రెండు అతి కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తప్పకుండా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా సాగిపోతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతాయి. తోబుట్టువులు, సమీప బంధువులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. దైవ సంబంధమైన వ్యవహారాల్లో పాలుపంచుకోవడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రేమ భాగస్వామి మీద ఖర్చు పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉండి ఈ రాశిని వీక్షించడం వల్ల నెలంతా చాలావరకు వైభవంగా సాగిపోతుంది. ఏలిన్నాటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ధన స్థానంలో ధనాధిపతి కుజుడి సంచారం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో తరచూ టెన్షన్లు తప్పకపోవచ్చు. చెడు స్నేహాల వైపు, వ్యసనాల వైపు మనసు మొగ్గు చూపుతూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. పిల్లలు పైకి రావడానికి, వారి నుంచి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్య సిద్ధి, వ్యవహార జయం వంటివి అనుభవానికి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార భాగస్వాములతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

Follow Us