హోలీ పండుగ రోజే చంద్ర గ్రహణం.. కామ దహనం చేయవచ్చా?

Updated on: Feb 08, 2026 | 9:13 AM

హోలీ పండుగ వచ్చేస్తోంది. వివిధ రకాల రంగులతో ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. పెద్ద వారు కూడా చిన్న పిల్లల్లా మారిపోయి, తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా హోలీ ఆడుకుంటారు. అంతే కాకుండా హిందూ మతంలో కూడా ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇక హోలీ అంటే? కామ దహనం చేసి, తర్వాత రోజు రంగులో హోలీ ఆడుకుంటారు.

1 / 5
అయితే ఈ సంవత్సరం మార్చి 3, 2026న హోలీ పండుగ వస్తుంది. అంతే కాకుండా ఈ రోజే సంపూర్ణ చంద్రగ్రహణం. దీంతో చాలా మందిలో అయోమయ పరిస్థితులు నెలకున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్ర గ్రహణం రోజు హోలీ పండుగ జరుపుకోవచ్చా? కామ దహనం చేయవచ్చా అనే డౌట్స్ ఉంటాయి. కాగా, దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

2 / 5
 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం నీడలో కామ దహనం చేయడం అస్సలే మంచిది కాదంట.  హోలీకా దహనం అనేది పూర్ణిమ తిథిలో చేస్తారు. ఈసారి ఫాల్గుణ మాసం శుక్ల పక్ష చతుర్దశీ తేది మార్చి 2,2026న వస్తుంది.  పూర్ణిమ తిథి మార్చి 2న సాయంత్రం 5.55కు ప్రారంభమై, మార్చి 3 సాయంత్రం 5.07 గంటలకు ముగుస్తుంది. అయితే కామ దహనం మార్చి 2న భద్రా కాలం ముగిసిన తర్వాత మాత్రమే చేయాలి అంట, అంటే  మార్చి 2 అర్ధరాత్రి 12 :50 గంటల నుంచి 2 :02 గంటల మధ్యలో కామ దహనం చేయడానికి ఉత్తమమైన సమయం అని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే మార్చి 3 ఉదయం 6 గంటల తర్వాత  గ్రహణం నూతక కాలం ప్రారంభం అవుతుంది కాబట్టి, రాత్రి 12 : 50 గంటల తర్వాత కామ దహనం చేయవచ్చునంట.

3 / 5
ఇక కొంత మంది చంద్ర గ్రహణం రోజు హోలీ పండుగ జరుపుకోవచ్చా? లేదా అని సందిగ్ధంలో ఉన్నారు. అయితే చంద్రగ్రహణం నూతక కాలం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో పండుగను జరుపుకోకూడదంట. అందువలన వీలైనంత వరకు గ్రహణం ముగిసిన తర్వాత మార్చి 4 చైత్ర కృష్ణ పక్ష ప్రతిపాదన హోలీ జరుపుకోవాలంట.  మార్చి 3న చంద్రగ్రహణం నూతక కాలం ఉండట వలన మార్చి 4న హోలీ పండుగ, మార్చి 2న కామ దహనం చేయాలని చెబుతున్నారు పండితులు.

4 / 5
ఎందుకంటే ? భారత దేశంలో 2026 సంవత్సరంలో ఏర్పడే మొదటి చంద్ర గ్రహణం ఇది. ఈ గ్రహణం మార్చి 3 న మధ్యాహ్నం 3 :20 గంటలకు ప్రారంభమై,  సాయంత్రం 6 :47 నిమిషాలకు ముగుస్తుంది.  ఇక ఈ చంద్ర గ్రహణానికి 9 గంటల ముందు నూతక కాలం ప్రారంభం అవుతుంది. అంటే మార్చి3న  ఉదయం 6 : 20 గంటలకు నూతక కాలం ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ రోజు హోలీ పండుగ జరుపుకోకూడదంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.