
మార్చి3 మంగళ వారం తెలుగు ప్రజలు అందరూ హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. కుంభ రాశిలో సూర్యుడు, బుధ గ్రహం సంయోగం వలన బుధాదిత్య రాజయోగం, సూర్యుడు, శుక్ర గ్రహం సంయోగం వలన శుక్రాధిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగాలు నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయి.

సింహ రాశి : సింహ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. అనుకోని అవకాశాలు వస్తాయి. ఉద్యోగ పరంగా చాలా బాగుంటుంది. వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ప్రేమ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకే అనుకూలంగా వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. కుటుంబ సభ్యులతో తీర్థ యాత్రలు చేసి, చాలా ఆనందంగా గడుపుతారు. వివాహం జరిగే యోగం ఉంది. అన్నింటా అనుకోని లాభాలు మీ వశం అవుతాయి.

మేష రాశి : మేష రాశివారికి హోలీ తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. గత కొన్ని రోజుల నుంచి నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు. ప్రేమ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ఖర్చులు తగ్గి, ఆదాయం పెరగడంతో చాలా ఆనందంగా గడుపుతారు.

తుల రాశి : తుల రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. అప్పుల సమస్యలు తీరిపోయి చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. అన్ని విధాలా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఊహకందని ప్రయోజనాలు చేకూరుతాయి. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి ఉద్యోగులకు హోలీ పండుగ లక్కు తీసుకొస్తుందని చెప్పాలి. వీరు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారి కల నెరవేరుతుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.