
మేషం: ప్రస్తుతం ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న గురువు కేతువుతో కలవడం వల్ల ఆధునిక నైపుణ్యాల మీద శ్రద్ధాసక్తులు కలుగుతాయి. గురువు దృష్టి మేష రాశి మీద పడడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం కలుగుతుంది. ఎవరూ ఊహించని మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. డబ్బు వృథా కావడం తగ్గుతుంది. ఒక పథకం ప్రకారం కష్టార్జితాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. సంతాన యోగం పడుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో గురు, కేతువులు కలవడం వల్ల ఉద్యోగంలో ఆగిపోయిన పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో భారీగా పెట్టుబడులు పెట్టి లబ్ధి పొందడం జరుగుతుంది. శుభకార్యాలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు.

సింహం: ఈ రాశిలో గురు, కేతువుల కలయిక వల్ల రావలసిన డబ్బు అనుకోకుండా చేతికి అందకపోవడం, ఊహించని స్థాయిలో జీతభత్యాలు పెరగడం, అంచనాలకు మించి లాభాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత ఈ సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆదా యం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెంది, ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. అనవసర పరిచ యాలు, వ్యసనాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది.

తుల: లాభ స్థానంలో గురు, కేతువుల యుతి వల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. అకస్మాత్తుగా ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. రావా ల్సిన డబ్బు వసూలు కావడం, ఆర్థిక సమస్యలు తగ్గడం, గురుడు వక్ర గ్రహంతో కలవడంవల్ల ఆక స్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సీనియర్లను కాదని ఉద్యోగంలో పదోన్నతి లభి స్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి గురువుతో కేతువు కలవడం వల్ల ఆకస్మిక విదేశీ అవకాశాలు లభిస్తాయి. అప్రయత్న ధన లాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఊహించని విధంగా శుభకార్యాలు జరుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలకు ఆటంకాలు తొల గిపోతాయి. ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమవుతాయి. రుణ భారం పూర్తిగా తగ్గిపో తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది.

కుంభం: గురు, కేతువులు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల అప్రయత్నంగా పెళ్లి సంబంధం కుదరడం, అకస్మాత్తుగా విదేశాలకు వెళ్లాల్సి రావడం, లాటరీ తగలడం, షేర్లు బాగా లాభించడం వంటివి జరుగుతాయి. గురువుకు సప్తమ స్థానం అత్యంత బలమైన స్థానం. ప్రతి పనీ ఈజీగా పూర్తవుతుంది. పెండింగులో పడిన శుభ కార్యాలు పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం దినదినాభివృద్ది చెందుతుంది. రావలసిన డబ్బు, బాకీలు పూర్తిగా వసూలవుతాయి.