Guru Gochar 2026: గురు కటాక్షంతో వారికి జాక్‌పాట్.. 2026లో ఆ రాశులకు పట్టందల్లా బంగారం..!

Edited By:

Updated on: Jan 02, 2026 | 1:00 PM

Jupiter Transit 2026: ధన కారకుడైన గురువు ఏ రాశులకు అనుకూలంగా ఉంటే ఆ రాశులవారు అతి తేలికగా ధనం సంపాదించడం జరుగుతుంది. ఇంట్లో కూర్చుని ధన సంపాదన చేయగలుగుతారు. ఈజీ మనీ సాధ్యమవుతుంది. కొత్త సంవత్సరంలో మే నెలాఖరులో గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛపడుతున్నందువల్ల పలువురి జీవితాలు ధనపరంగా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల వంటివి కనక వర్షం కురిపించే అవకాశం ఉంది.

1 / 6
మిథునం: కొత్త సంవత్సరంలో జూన్ మొదటి వారం నుంచి గురువు ధన స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి ‘వద్దంటే డబ్బు’ అన్నట్టుగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల వంటివి ఇబ్బడిముబ్బడిగా లాభిస్తాయి. కష్టనష్టాల నుంచి బయటపడడం, సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది. అనేక విధాలుగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల అనేక పర్యాయాలు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ధన ప్రవాహం ఉంటుంది. ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. గృహ లాభం కూడా కలుగుతుంది.  కొద్దిగా ప్రయత్నిస్తే మట్టి కూడా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభాల వర్షం కురిపిస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతాయి.

3 / 6
కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛస్థితికి రావడం వల్ల ఒకటి రెండు ధన యోగాలు పట్టడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి అనేక మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఇంట్లో కూర్చుని సంపాదించగల మార్గాలు కూడా అందుతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సంపాదనకు బాగా అవకాశం  జీత భత్యాలు విశేషంగా వృద్ధి చెందుతాయి. ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి అనుకూల స్థానాల్లో భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛస్థితి వల్ల జీవితంలో ఎన్నడూ ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. ఇంట్లో కూర్చుని ఒకటికి రెండు ఉద్యోగాలు చేయడం సాధ్యమవుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అపారంగా లాభిస్తాయి.

5 / 6
మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన ఈ రాశిలోనూ, ద్వితీయ, తృతీయ స్థానాల్లోనూ సంచారం చేయడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. అనేక శుభయోగాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి, వ్యక్తిగత పురోగతికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. వడ్డీ వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి. లాటరీ రావడానికి కూడా అవకాశం ఉంది.

6 / 6
మీనం: ఈ రాశికి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో శుక్రుడు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందు వల్ల సునాయాసంగా ధన సంపాదనకు అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. కుబేర యోగం, ధన లక్ష్మీ యోగం కలిగే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబపరంగా కూడా ధన సంపాదన పెరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై, సంపద వృద్ధి చెందుతుంది.