
వృషభం: ఈ రాశికి తృతీయ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. తేలిక మార్గాల్లో ధనాదాయం వృద్ధి చెందుతుంది. కొన్ని సమస్యలు, వివాదాలు తేలి కగా పరిష్కారమవుతాయి. భారీ కార్యక్రమాలు సైతం సునాయాసంగా నెరవేరుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. మహా భాగ్య యోగం, విపరీత రాజయోగం కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది.

మిథునం: ఈ రాశికి ధన, దశమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వైభ వంగా సాగిపోతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయ వంతం అయి, ఐశ్వర్యవంతులవుతారు. వివాహం కాని వారికి సంపన్న వ్యక్తితో వివాహ సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు సైతం మంచి జీతభత్యాలతో కూడిన ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటకం: రాశ్యధిపతికి, భాగ్యాధిపతికి మధ్య పరివర్తన జరగడం వల్ల మహా భాగ్య యోగంతో పాటు విపరీత రాజయోగం కూడా కలుగుతుంది. ఆస్తి విలువ పెరగడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం, ఆస్తి వివా దాలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. పిల్లలు అంచనాలకు మించి వృద్ధిలోకి వస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు లభిస్తాయి. అప్రయత్న ధన లాభం ఉంటుంది. ఒకటి రెండు కీలక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

కన్య: ఈ రాశికి లాభ, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల అతి తక్కువ ప్రయత్నంతో అత్యధిక ధన లాభం చేకూరుతుంది. జీవిత భాగస్వామికి కూడా బాగా కలిసి వస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి సంబంధం కుదరడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి విపరీతంగా పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.

వృశ్చికం: ఈ రాశికి పంచమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల విపరీత రాజయోగం, మహా భాగ్య యోగం కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈ రాశివారి ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. కొంత ప్రయత్నపూర్వకంగానూ, కొంత అప్రయత్నం గానూ బాగా సంపద సమకూరుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

మీనం: రాశ్యధిపతి గురువుకు, పంచమాధిపతి చంద్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. మహా భాగ్య యోగం పడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధన లాభం కలుగుతుంది. లాటరీ యోగం పట్టే అవకాశం కూడా ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఊపందుకుని, లాభదాయకంగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులు ఊహించిన దానికంటే మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది.