Lucky Zodiac Signs: వీరికి ముచ్చటగా మూడు యోగాలు..అదృష్టం పట్టబోతోంది..!

Edited By:

Updated on: Oct 20, 2026 | 8:01 PM

ఈ నెల(అక్టోబర్) 25, 26, 27 తేదీల్లో చంద్రుడు మేష రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ మూడు రోజుల పాటు చంద్రుడు చతుర్థ స్థానంలో ఉన్న కుజుడితో పరివర్తన చెందడం ఒక విశేషం కాగా, 26వ తేదీ పౌర్ణమి కావడం, చంద్రుడికి శుక్ర, బుధులతో సమసప్తకం ఏర్పడడం, కేంద్రంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో గజకేసరి యోగం కూడా చోటు చేసుకోవడం మరో పెద్ద విశేషం. దీనివల్ల చంద్రుడికి బలం బాగా పెరిగి, కొన్ని రాశులవారి ప్రయత్నాల్ని సక్సెస్ చేయడం, వారి అభివృద్ధికి మార్గం సుగమం చేయడం, వారి మనసులోని కోరికలు తీర్చడం జరుగుతుంది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులవారు అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది.

1 / 6
మేషం: చంద్రుడితో చోటు చేసుకుంటున్న గ్రహ మార్పులన్నీ ఈ రాశివారికి అనుకూలంగా ఉన్నాయి. రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఊహించని ఆర్థికాభివృద్ధి చోటు చేసుకుంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ అవకాశాలు లభిస్తాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధికి బాగా అవకాశముంది.

2 / 6
మిథునం: ఈ రాశికి ఈ మూడు రోజులు అయిదు గ్రహాలు అనుకూలంగా మారడం విశేషం. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొద్ది ప్రయత్నంతో సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కా రమవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. షేర్లు, స్పెక్యు లేషన్లు, ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

3 / 6

కర్కాటకం: దశమ స్థానంలో రాశినాథుడు చంద్రుడికి సంపూర్ణంగా బలం పట్టడం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం బాగా మెరుగుపడతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయం అంచనాల్ని మించుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.

4 / 6
తుల: ఈ రాశికి చంద్రుడితో పాటు అయిదు గ్రహాలు అనుకూలంగా మారడం, గజకేసరి, చంద్ర మంగళ  యోగాలు ఏర్పడడం వంటి కారణాల వల్ల ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపా రాలు బాగా పురోగతి చెందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదే శాల్లో ఉన్న సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశా లకు వెళ్లే అవకాశం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

5 / 6
మకరం: ఈ రాశికి చతుర్థ, సప్తమ, దశమ స్థానాల్లో చంద్రుడితో యోగాలు ఏర్పడుతున్నందువల్ల రాజ యోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగపరంగా ఇతర సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఇతర దేశాలకు వెళ్లే అవకాశాలు కలుగుతాయి. ఆదాయం, ఆరోగ్యం బాగా మెరుగుపడతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. షేర్లతో సహా అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

6 / 6
మీనం: పంచమాధిపతి చంద్రుడికి, ధన, భాగ్యాధిపతి కుజుడికి మధ్య పరివర్తన చోటు చేసుకోవడంతో పాటు గజకేసరి, ధన ధాన్య సమృద్ధి యోగాలు ఏర్పడడం వల్ల ఈ రాశివారికి ఏ ప్రయత్నం చేప ట్టినా విజయవంతమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఇంట్లో శుభ కార్యాలకు మార్గం సుగమమవుతుంది. షేర్లు లాభిస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us