Foreign Travel Yoga: అనుకూలంగా శుభ గ్రహాలు.. వీరికి విదేశీ యోగాలు పట్టే ఛాన్స్..!

Edited By:

Updated on: Sep 28, 2026 | 4:41 PM

విదేశీ ఉద్యోగాలు, విదేశీ చదువులు, విదేశీ పెళ్లి సంబంధాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలం కావాలన్న పక్షంలో చర రాశులైన మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల్లో గ్రహాలు బలంగా ఉండాలి. చర రాశుల్లో శుభ గ్రహాలైన గురు, బుధ, శుక్రులు అనుకూలంగా ఉన్న పక్షంలో విదేశీ ప్రయత్నాలకు తప్పకుండా మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం గురువు కర్కా టక రాశిలో ఉచ్ఛ స్థితిలో, తులా రాశిలో శుక్రుడు స్వస్థానంలో, తులా రాశిలో బుధుడు మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల విదేశీయానానికి అవకాశాలు కలుగుతున్నాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి విదేశీ యోగాలు పట్టే అవకాశం ఉంది.

1 / 6
మేష రాశి: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి కుజుడి సంచారం, అదే రాశిలో గురువు ఉచ్ఛస్థితి, సప్త మంలో శుక్ర, బుధుల సంచారం వల్ల తప్పకుండా విదేశీ సంపాదన యోగం పడుతుంది. అక్టోబర్ 31 లోగా ఉద్యోగులు, నిరుద్యోగుల విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. విదేశీ చదువుల కోసం, విదేశీ నైపు ణ్యాల కోసం ప్రయత్నిస్తున్నవారికి శుభవార్తలు అందుతాయి. విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది.

2 / 6
మిథున రాశి: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో చర రాశిలో ఉండడం, ఈ రాశికి ద్వితీయ స్థానంలో గురు గ్రహం ఉచ్ఛ స్థితిలో ఉండడం, పంచమ స్థానంలోనే శుక్రుడి సంచారం వంటి కారణాల వల్ల ఈ రాశి వారికి విదేశీ ఉద్యోగ యోగం పడుతోంది. నిరుద్యోగులకు విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభించడం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సమీప భవిష్యత్తులో విదేశీ సంబంధం కుదురుతుంది.

3 / 6
కర్కాటక రాశి: ఈ చర రాశిలో గురువు, దశమాధిపతి కుజుడి యుతి, చతుర్థ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారికి  కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యో గాలు చేసుకుంటున్నవారికి అన్ని విధాలా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది. అక్టోబర్ 31 లోగా ఈ రాశివారికి విదేశీ సంబంధం కూడా కుదురుతుంది. ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది.

4 / 6
కన్య రాశి: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి, ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడితో శుక్రుడియుతి వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ సంపాదన యోగం  పడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కలుగుతాయి. ఈ రాశి వారు విదేశీ సంబంధం కోసం ప్రయత్నించడం మంచిది. విదేశీ సంబంధం కుదరడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ రాశివారి జీవితం ఒక్కసారిగా విదేశీ శైలికి మారిపోయే అవకాశం ఉంది.

5 / 6
తుల రాశి: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడితో భాగ్యాధిపతి బుధుడి యుతి, దశమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి వల్ల ఈ రాశివారికి రెండు నెలల్లో విదేశీ జీవితం ప్రాప్తించే అవకాశం ఉంది. వీరికి తప్పకుండా విదేశీ సంపాదన యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలపరంగా కూడా విదేశీ అవకాశాలు లభి స్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో అనుకోకుండా విదేశీ సంబంధం కుదురుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. విదేశీ ఉద్యోగులకు ఆశించిన స్థిరత్వం లభిస్తుంది.

6 / 6
మకర రాశి: రాశ్యధిపతి శని విదేశీ స్థానాలైన భాగ్య, వ్యయ స్థానాలను వీక్షించడం, సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి, దశమ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి త్వరలో తప్పకుండా విదేశీయాన యోగం, విదేశీ సంపాదన యోగం, విదేశీ నివాస యోగం కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. విదేశాల్లో స్థిర పడిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి సంబంధం కుదరడం గానీ తప్పకుండా జరుగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us