
ధంతేరస్ పండుగను నవంబర్ 6 శుక్రవారం రోజున జరుపుకోనున్నారు. ఈ రోజున లక్ష్మీదేవిని , కుబేరుడిని, ధన్వంతరి దేవుళ్లను పూజించి, బంగారం, వెండి కొనులు చేయడం చేస్తుంటారు. ఇక ఈ పండుగ జారుకోవడానికి ముఖ్య కారణం సముద్ర మథనం సమయంలో కార్తీక మాసంలోని కృష్ణ పక్షం పదమూడవ రోజు ధన్వంతరీ దేవుడు తన చేతుల్లో అమృత కలశంతో అవతరించారని చెబుతుంటారు. అందువలన ఈ పండుగను ఆయన ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు.

హిందూ పవిత్రమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ బంగారం, వెండి, కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం చేస్తుంటారు. అయితే ఈ రోజు బంగారం వెండి కొనుగోలు చేయడం కంటే, ధనియాలు కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదం అని చెబుతున్నారు పండితులు? ఈరోజున ఇవి ఎందుకు కొనుగోలుచేయాలో దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో చూసేద్దాం.

ధంతేరస్ రోజున కొత్తిమీర గింజలు కొనుగోలు చేయడం వలన ఇది ఇంటిలో సానుకూలతను పెంపొందించడమే కాకుండా సంపద పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఆర్థికంగా చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. అప్పుల బాధల నుంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తుంది.

అంతే కాకుండా ఎవరు అయితే ఈ రోజున ధనియాలు కొనుగోలు చేస్తారో, వారు ఎప్పుడూ కూడా అప్పుల సమస్యల్లో చిక్కుకోరని నమ్ముతుంటారు. అయితే దీనికి వెనకున్న ముఖ్య కారణం లక్ష్మీదేవి అనుగ్రహం, రాక, ఆశీస్సులు. కొత్తిమీర లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. అందువలన వీటిని కొనుగోలు చేసి అమ్మవారికి సమర్పించడం వలన ఇంటిలో సంపద పెరుగుతుంది. శ్రేయస్సు కూడా పెరుగుతుందంట.

అయితే చాలా మందికి ఈ రోజు ధనియాలు కొనుగోలు చేసి వాటిని ఏం చేయాలో అంతగా తెలియదు. అయితే ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. ధంతేరస్ రోజున, ధనియాలు కొనుగోలు చేసి వాటిని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి, మీ అల్మారాలో భద్ర పరుచుకోవాలి. దీని వలన మీ ఖజానా ఎప్పుడూ ఖాళీ అవ్వదు. నోట్: ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణుల సలహా మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.