Money Astrology: హమ్మయ్య.. వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి..!

Edited By:

Updated on: Apr 22, 2026 | 6:33 PM

ఈ నెల(ఏప్రిల్) 30వ తేదీన బుధుడు మేష రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. ఆ రాశిలో మే 14 వరకు ఉండే బుధుడు అదే రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రవితో యుతి చెందడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉచ్ఛ రవితో ఏర్పడడం వల్ల రెట్టింపు బలంతో పని చేసే అవకాశం ఉంది. దీని వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశుల వారికి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఎక్కడ ఉన్నా తమ ప్రతిభా పాటవాలను, సమర్థతను నిరూపించుకుని బాగా లబ్ధి పొందడం జరుగుతుంది.

1 / 6
మేషం: ఈ రాశిలో బుధ, రవులు కలవడం వల్ల తప్పకుండా రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. అనేక శుభ ఫలితాలతో పాటు విపరీత రాజయోగం కూడా పడుతుంది. ఎటువంటి సమస్య అయినా పరిష్కారమవుతుంది. ప్రయాణాలు, ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో సమర్థతను నిరూపించుకుని అందలాలు ఎక్కుతారు. సరికొత్త మార్గాలలో ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటారు.

2 / 6
మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడు, ఉచ్ఛ రవులు కలుస్తున్నందువల్ల తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు. వ్యాపారాలు అంచనాలకు మించి పురోగమిస్తాయి. సామాజికంగా కూడా హోదా, స్థితి పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. గృహ, వాహన ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి.

3 / 6
కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో రవి, బుధులు యుతి చెందడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. పని చేస్తున్న సంస్థలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. అంచనాలకు మించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం లభిస్తుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగాతగ్గిపోతాయి.

4 / 6
సింహం: రాశినాథుడు రవి భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టడం ఒక విశేషం కాగా, అక్కడ బుధుడితో కలవడం మరో విశేషం. దీనివల్ల ఈ రాశివారికి ఉత్తమ స్థాయి బుధాదిత్య యోగంతో పాటు విపరీత రాజ యోగం కూడా పడుతుంది. ఉద్యోగంలోనే కాక, సర్వత్రా ప్రాధాన్యం, ప్రాధాన్యం వృద్ది చెందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వమూలక ధన లాభం, గుర్తింపు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి, ప్రభుత్వం నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

5 / 6
తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో లాభాధిపతి రవితో భాగ్యాధిపతి బుధుడు కలవడం వల్ల ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలో మారాలనుకుంటున్నవారి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లన్నీ చాలావరకు తగ్గిపోతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. షేర్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల్లో మదుపు చేసి బాగా లాభాలు పొందుతారు.

6 / 6
మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో భాగ్య స్థానాధిపతి బుధుడు రవిని కలవడం వల్ల ఉత్తమ స్థాయి బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ రాశివారు తప్పకుండా ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభించడంతో పాటు లాభాలు అంచనాల్ని మించుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరించి, పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us