Maha Yogas: రెండు మహా యోగాలు.. ఆ రాశుల వారు నక్కతోక తొక్కబోతున్నారు!

Edited By: Janardhan Veluru

Updated on: Sep 19, 2025 | 4:18 PM

Double Maha Bhagya Yogas: కన్యారాశిలో ఉచ్ఛ బుధుడితో రవి యుతి చెందడం వల్ల ఏర్పడిన బుధాదిత్య యోగానికి తోడుగా ఈ నెల (సెప్టెంబర్) 24, 25, 26 తేదీల్లో తులా రాశిలో కుజ, చంద్రులు యుతి చెందడం వల్ల చంద్ర మంగళ యోగం కూడా ఏర్పడుతోంది. మూడు రోజుల పాటు రెండు మహా భాగ్య యోగాలు చోటు చేసు కుంటున్నందువల్ల సంపద వృద్ధికి సంబంధించి రెట్టింపు ఫలితాలు కలగబోతున్నాయి. ఈ బుధాదిత్య యోగం, తిరుగులేని భాగ్య యోగమైన చంద్ర మంగళ యోగం ఏక కాలంలో ఏర్పడు తున్నందు వల్ల మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, కుంభ రాశులు నక్క తోకను తొక్కబోతున్నాయి.

1 / 6
మిథునం: ఈ రాశికి నాలుగు, అయిదు స్థానాల్లో బుధాదిత్య యోగం, చంద్ర మంగళ యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. ఈ రాశి వారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ధన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి తృతీయ, చతుర్థ స్థానాల్లో బుధాదిత్య యోగం, చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై భూలాభం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాలను మించి లాభిస్తాయి. జీతభత్యాలు పెరగడం, లాభాలు వృద్ధి చెందడం  జరుగుతుంది.

3 / 6
కన్య: ఈ రాశిలో బుధాదిత్య యోగం, ధన స్థానంలో చంద్ర మంగళ యోగం చోటుచేసుకోవడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను దాటుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశి దశమ, లాభ స్థానాల్లో బుధాదిత్య, చంద్ర మంగళ యోగాలు పడుతున్నందువల్ల  ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థికపరంగా తప్పకుండా దశ తిరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలగడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.

5 / 6
మకరం: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో ఈ రెండు మహా భాగ్య యోగాలు కలుగుతున్నందువల్ల అనేక మార్గాల్లో డబ్బు కలిసి వస్తుంది. రావలసిన సొమ్మును, బాకీలను పూర్తిగా రాబట్టుకుంటారు.  అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, షేర్లు, స్పెక్యు లేషన్ల వల్ల బాగా ఆదాయం పెరుగుతుంది. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. తల్లితండ్రుల వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతాయి.

6 / 6
కుంభం: ఈ రాశికి అష్టమ, భాగ్య స్థానాల్లో ఈ బుధాదిత్య, చంద్ర మంగళ యోగాలు ఏర్పడుతున్నందువల్ల అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి లాభానికి, భూ లాభానికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో త్వరలో సొంత ఇల్లు అమరుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. మదుపులు, పెట్టుబడుల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలిగే అవకాశం ఉంది.