Astrology: కీలక గ్రహాల అనుకూలత.. వారికి ఆర్థిక, రుణ సమస్యల నుంచి విముక్తి!

Edited By:

Updated on: Aug 04, 2026 | 4:39 PM

Money Astrology:ఆగస్టులో శుక్రుడు, కుజుడు, బుధుడు రాశులు మారడంతో పాటు గురుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారు రుణభారం తగ్గించుకోవడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు అనుకూల అవకాశాలు పొందే వీలుంది.

1 / 7
ఆగస్టులో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారడం వల్ల కొన్ని రాశుల వారికి రుణ సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభించే అవకాశం ఉంది. ఈ నెల మొదటి వారంలోనే శుక్ర, కుజ, బుధులు రాశులు మారడం వల్ల ఈ రాశుల వారికి నెల ద్వితీయార్థం లోగా చాలా వరకు ఆర్థిక, రుణ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు లభిస్తాయి. ధన కారకుడు గురువు కూడా ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ రాశులవారు కొద్ది ప్రయత్నంతో, కొద్ది ప్రణాళికతో అప్పుల బాధ నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. గ్రహాల మార్పు వల్ల మేషం, మిథునం,  కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి రుణ సమస్యలు బాగా తగ్గే అవకాశం ఉంది.

2 / 7
మేషం: గురు, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు కొద్దిపాటి ప్రణాళికతో రుణ సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్నందువల్ల, రాశ్యధిపతి కుజుడి తోడ్పాటు వల్ల ఈ రాశివారు ఆర్థిక, రుణ, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. గృహ, వాహనాలకు సంబంధించిన రుణాలు తప్ప మిగిలిన రుణాలు, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.

3 / 7
మిథునం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడు గురువుతో యుతి చెందడం వల్ల ఆగస్టు ఆఖరు లోగా ఆర్థిక, రుణ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటు ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం వల్ల ఆదాయ వృద్ధితో పాటు ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఫలితంగా ఇక నుంచి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. రుణాలు ఇవ్వగలిగిన స్థితికి చేరుకుంటారు.

4 / 7
కర్కాటకం: ఈ రాశిలో ధన కారకుడు గురువు ఉచ్ఛ స్థితి, ధనాధిపతి రవి ధన స్థానంలో సంచారం వల్ల ఈ రాశివారికి ఈ నెలలో తప్పకుండా రుణ భారం నుంచి విముక్తి కలుగుతుంది. ఖర్చులు తగ్గించు కుని పొదుపు పాటించడంతో పాటు కొత్తగా రుణాలు చేయకపోవడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం వల్ల రుణ భారం తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడంతో పాటు ఆర్థికంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

5 / 7
కన్య: ఈ రాశికి ప్రస్తుతం రుణ స్థానం కంటే లాభ స్థానం బాగా పటిష్ఠంగా ఉన్నందువల్ల, నాలుగు గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల రుణ సమస్యలు పూర్తిగా మటుమాయం అవుతాయి. ఈ నెల ద్వితీయార్థం నాటికి ఈ రాశివారు రుణ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ప్రణాళికా బద్ధంగా అదనపు ఆదాయాన్ని మదుపు చేసుకుని, సద్వినియోగం చేయడం వల్ల ఆర్థిక సమ స్యలు, రుణ బాధల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఇక ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు.

6 / 7
వృశ్చికం: ఈ రాశివారు ఏడాది కాలం నుంచి అనుభవిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి త్వరలో విముక్తి లభించే అవకాశం ఉంది. రాశులు మారిన నాలుగు గ్రహాలతో పాటు, ధన కారకుడు గురువు కూడా భాగ్య స్థానంలో అనుకూలంగా ఉండడం వల్ల వీరికి ఇక రుణ సమస్యలు ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరగడం, రావలసిన డబ్బు రావడం, జీతభత్యాలు వృద్ధి చెందడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.

7 / 7
మకరం: ఈ రాశివారికి కష్టార్జితం పెరగడంతో పాటు ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ప్రణా ళికాబద్ధంగా వ్యవహరించి, ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించి రుణ సమస్యలను పూర్తిగా తగ్గించుకోవడం జరుగుతుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి రుణ, ఆర్థిక సమస్యలు క్రమంగా మటు మాయం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం, ఉచిత సహాయాలు, దాన ధర్మాలకు దూరంగా ఉండడం మంచిది. ఆగస్టు తర్వాత వీరికి రుణ సమస్యలు ఉండే అవకాశం లేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us