మన టైమ్ వచ్చేసింది భయ్యా..! ఆగస్టులో ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే..

Edited By:

Updated on: Jul 30, 2026 | 3:27 PM

August 2026 Horoscope: ఆగస్టు నెలలో కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి వరుసగా రాశులు మార్చడం జ్యోతిష్యపరంగా కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. ఈ గ్రహ సంచారాల ప్రభావంతో మేషం, వృషభం, మిథునం, సింహం, కన్య, తులా, వృశ్చిక రాశుల వారి జీవితాల్లో ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాల్లో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహ గోచారాల ప్రభావం నెల రోజులకు పైగా కొనసాగి ఆయా రాశుల వారికి కొత్త అవకాశాలు, సవాళ్లను తీసుకురావచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

1 / 8
ఆగస్టు నెలలో కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి రాశులు మారడం జరుగుతోంది. ఇందులో కుజుడు 3వ తేదీన మిథున రాశిలోకి, శుక్రుడు 3వ తేదీన కన్యారాశిలోకి, బుధుడు 6వ తేదీన కర్కాటక రాశిలోకి, రవి 17 వ తేదీన తన స్వక్షేత్రమైన సింహ రాశిలోకి మారడం జరుగుతోంది. వీటి ప్రభావం ఇవి అధిపతులుగా ఉన్న రాశుల వారి జీవితాల మీద పడే అవకాశం ఉంటుంది. కుజుడి మార్పు వల్ల మేష, వృశ్చిక రాశులు, శుక్రుడి మార్పు వల్ల వృషభ, తులా రాశులు, బుధుడి మార్పు వల్ల మిథున, కన్యా రాశులు, రవి మార్పు వల్ల సింహ రాశి జీవితాలు కొత్త మలుపులు తిరుగుతాయి. వీటి ప్రభావం నెల రోజులకు పైగా ఉంటుంది.

2 / 8
మేష రాశి: ఈ రాశ్యధిపతి కుజుడు మిథున రాశిలోకి మారడం వల్ల ఈ రాశివారు కొన్ని కొత్త ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలతో పాటు ఉద్యోగం మారే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఆదాయం పెరిగి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూ లలో సక్సెస్ అవుతారు. ఇతరులతో వ్యవహరించే తీరు బాగా మెరుగుపడుతుంది. కొత్త నైపు ణ్యాలు అలవడతాయి. బాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు సమసిపోతాయి.

3 / 8
వృషభ రాశి: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారు ప్రతి విషయంలోనూ కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఉద్యోగంలో పనితీరు మారుతుంది. బాధ్య తలు, లక్ష్యాలను సక్రమంగా, సవ్యంగా పూర్తి చేయడం మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి షేర్లు, స్పెక్యులేషన్ల వంటి ప్రయత్నాలు చేపడతారు. పిల్లల చదువుల మీద దృష్టి పెడతారు. ప్రేమలో పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి బాగా లబ్ధి పొందుతారు.

4 / 8
మిథున రాశి: రాశినాథుడు బుధుడు ద్వితీయ స్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారు ఆదాయ వృద్ధికి, కుటుంబ అభ్యున్నతికి బాగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి రాజీమార్గంలో బయటపడతారు. అదనపు ఆదాయాన్ని మదుపు చేసుకోవడం జరుగుతుంది. రావలసిన సొమ్మును, బాకీలను వసూలు చేసుకుంటారు. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి.

5 / 8
సింహ రాశి: ఆగస్టు ద్వితీయార్థంలో రాశ్యధిపతి రవి తన స్వక్షేత్రమైన సింహ రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు తమ జీవనశైలి మీద దృష్టి పెడతారు. ఉద్యోగంలో తన పనితీరును మెరుగుపరచుకోవ డంతో పాటు, ఆర్థికంగా మరింత మెరుగైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నాలు సాగించి సఫలమ వుతారు. సామాన్య జీవితం నుంచి ఉన్నతస్థాయి జీవితానికి ఎదిగే ప్రయత్నం చేస్తారు. వీరికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది.

6 / 8
కన్య రాశి: రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ఈ రాశివారు తమ వ్యక్తిగత పురోగతి మీద మరింతగా శ్రద్ద పెట్టే అవకాశం ఉంది. వీరి సరికొత్త ప్రయత్నాల వల్ల ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడి పెట్టి లబ్ధి పొందడంతో పాటు, రావలసిన డబ్బును, రాదనుకున్న డబ్బును వసూలు చేసుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెరుగుతుంది. కొందరు ప్రముఖులతో తమకున్న పరిచయాలను బాగా ఉపయోగించుకుంటారు.

7 / 8
తులా రాశి: రాశ్యధిపతి శుక్రుడు వ్యయ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారు సొంత ఇంటి మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడంతో పాటు, ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడిపే ప్రయ త్నం చేస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపా రాల్లో మార్పులు చేపట్టి కొత్త పుంతలు తొక్కిస్తారు. ఉద్యోగంలో తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకుంటారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి సరికొత్త ప్రయత్నాలు చేపడతారు.

8 / 8
వృశ్చిక రాశి: ఈ రాశ్యధిపతి కుజుడు తనకు అష్టమ స్థానమైన మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఆస్తి వివాదాలను ఏదో విధంగా పరిష్కరించుకోవడం మీదా, ఆస్తిపాస్తులను సమకూర్చుకోవడం మీదా దృష్టి పెడతారు. పెండింగ్ పనులన్నిటినీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి లబ్ధి పొందుతారు. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఖర్చుల్ని తగ్గించుకుని కఠినంగా పొదుపు పాటిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత ఎక్కువగా శ్రమపడి మెరుగైన ఫలితాల్ని సాధించడం జరుగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us