
మేషం: జూలై 15 నుంచి ప్రారంభంకానున్న ఆషాఢ మాసంలో ఈ రాశివారికి పెళ్లిళ్లు, పెళ్లి ప్రయత్నాలు మినహా ఇతర విషయాలన్నీ అనుకూలంగా సాగిపోయే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లోనూ, వైవాహిక జీవితంలోనూ కొద్దిగా సమస్యలు ఉండే అవ కాశం ఉంది. ఉద్యోగ జీవితం మాత్రం వైభవంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ఆర్థిక బలం బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందు తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అత్యధికంగా లాభాలు పొందుతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

వృషభం: ఆషాఢ మాసంలో రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానమైన సింహరాశిలో సంచారం వల్ల ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. శుక్రుడు సింహ రాశిలో ఉన్నంత వరకు రాజయోగాలు, ధన యోగాలకు అవకాశం ఉంది కానీ, కుటుంబ జీవితంలో మాత్రం సుఖ సంతోషాలు బాగా తగ్గు తాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయానికి సంబంధించి పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగుతాయి.

కర్కాటకం: ఈ రాశికి ఈ ఆషాఢమంతా ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఈ రాశిలో ధనాధిపతి రవి ప్రవే శించడం, ధన స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తీరడంతో పాటు ఆర్థికంగా స్థిరత్వం కూడా లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ఆచితూచి అడుగువేయడం మంచిది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు.

తుల: దశమంలో రవి, లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతి లభించడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. అత్యంత సంపన్న జీవితంగా మారిపోయే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో అధి కార యోగం పడుతుంది. మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. అయితే, వీరు పెళ్లి ప్రయ త్నాలను ఆపడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ధనుస్సు: ఆషాఢ మాసమంతా ఈ రాశివారికి అత్యంత యోగదాయకంగా, శుభప్రదంగా సాగిపోతుంది. ఆక స్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు పూర్తి ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు. ఉద్యో గులకు డిమాండ్ పెరుగుతుంది. కాగా, జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం తీవ్ర అసంతృప్తి కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

కుంభం: ఈ రాశికి రవి, శుక్రుల మార్పు వల్ల ఆషాఢ మాసమంతా చాలావరకు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు అనేక విధాలుగా రాబడి వృద్ది చెందుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. అయితే, కుటుంబ జీవితం మాత్రం బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి.