
మేషం: ఈ రాశికి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కుజ, రాహు, శుక్ర, బుధ, గురువులు అనుకూలంగా మారడం వల్ల అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. పూర్తి స్థాయిలో లక్ష్మీ యోగం పడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ దినదినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుద లకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అదృష్టం కలిసి వస్తుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న శుభ కార్యాలు జరిగే సూచనలున్నాయి. సమస్యలు, ఒత్తిళ్లల నుంచి విముక్తి లభిస్తుంది.

వృషభం: ఈ రాశికి శని, కుజ, బుధ, శుక్ర, రవులు అనుకూలమవుతున్నందువల్ల ఈ నెల 10, 24 తేదీల మధ్య ఈ రాశివారి ప్రాభవం, వైభవం ఏ రంగంలో ఉన్నా అనేక విధాలుగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. ఉద్యోగంలో స్థాయి, హోదా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల బెడద తగ్గిపోతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

కర్కాటకం: ఈ రాశికి రాశినాథుడైన చంద్రుడితో పాటు బుధ, శుక్ర, రవి, శనీశ్వరుడు కూడా అనుకూలమవు తున్నందువల్ల సుమారు 15 రోజుల పాటు ఈ రాశివారికి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగి పోతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. ఇప్పుడు చేపట్టే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. అనేక మార్గాల్లో సంపద పెరుగుతుంది. సామాన్య స్థితిలో ఉన్నవారు సైతం బాగా ఉచ్ఛ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

కన్య: ఈ రాశికి రాహువు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రవి అనుకూలమవుతున్నందువల్ల కార్తీక మాసంలో మొదటి పక్షమంతా వైభవంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడి ఐశ్వర్యవంతులయ్యే అవకాశముంది. రెండు మూడుసార్లు ధన యోగాలు పట్టడం జరుగుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాలు లాభాలతో పురోగమిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి.

వృశ్చికం: ఈ రాశివారికి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపో తుంది. కుజ, గురు, శని, చంద్ర, శుక్ర గ్రహాలు బాగా అనుకూలిస్తున్నందువల్ల ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ధనపరంగా మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదో న్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. సంపన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

మకరం: ఈ రాశికి అమావాస్య తర్వాత నుంచి రాశ్యధిపతి శని, శుక్ర, బుధ, రవి, రాహువుల అనుకూలత వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గి పోతాయి. కొందరితో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల్లో కొత్త పుంతలు తొక్కుతాయి. ముఖ్యమైన శుభ వార్తలు వింటారు.