Money Astrology 2026: మన టైమ్ వచ్చేసింది భయ్యా.. ఆర్థికంగా ఇక వీరి దశ తిరగడం ఖాయం!

Edited By:

Updated on: Sep 09, 2026 | 12:49 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతక చక్రంలో ద్వితీయ స్థానం, అంటే ధనం, కుటుంబానికి సంబంధించిన స్థానం, అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ద్వితీయ స్థానాన్ని బట్టి జాతకుడి ఆదాయ వృద్ధి, ఆర్థిక సమస్యల పరిష్కారం, ఆర్థిక పురోగతి వంటి వాటి గురించి చెప్పవలసి ఉంటుంది. ఓ వ్యక్తి జీవితంలో ఏ విధంగా పురోగతి సాధించేదీ, ఏ మేరకు పురోగతి సాధించేదీ ద్వితీయ స్థానమే చెబుతుంది. ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి మేషం, వృషభం, మిథునం, సింహం, కన్య, మకర రాశుల వారు ధనాధిపతి వల్ల తమ తమ రంగాల్లో ఆర్థికంగా పైపైకి ఎదిగే అవకాశం ఉంది.

1 / 6
మేషం: ఈ రాశికి ధన స్థానాధిపతి శుక్రుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల  వీరికి జనవరి 2 వరకు ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం జరగకపోవచ్చు. ఆదాయ ప్రయత్నాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ప్రముఖు లతో పరిచయాలు విస్తరించి, ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఈ నెల 23 తర్వాత వీరికి అనేక పర్యాయాలు ధనయోగాలు  కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.

2 / 6
వృషభం: ఈ రాశికి ధన స్థానాధిపతి బుధుడు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్ల వ్యాపారం బాగా లాభిస్తుంది. నెలాఖరులోగా ఆస్తి సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి, ఆర్థిక ఒప్పందాలు కుదురుతాయి. భాగస్వామ్య వ్యాపా రాల వల్ల బాగా లబ్ధి పొందుతారు. అరుదైన విదేశీ ఆఫర్లు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

3 / 6
మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల అక్టోబర్ 31 లోపల ఈ రాశికి అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్దికి కొత్త అవకాశాలు లభిస్తాయి. తల్లి తండ్రుల నుంచి సంపద లభించే అవకాశం ఉంది. ప్రభుత్వమూలక ధన లాభం, గుర్తింపు కలు గుతాయి. రాజీమార్గంలో ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమై విలువైన ఆస్తిపాస్తులు లభి స్తాయి. కొద్ది ప్రయత్నంతో ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాల  పెరుగుదలకు అవకాశం ఉంది.

4 / 6
సింహం: ఈ రాశికి ధన స్థానంలో బుధుడి ఉచ్ఛ స్థితి వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లోనే కాక, ఉద్యోగ మార్పు ప్రయత్నాల్లో కూడా విజయం సాధిస్తారు. శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో సంపన్న కుటుంబంతో సంబంధం కుదిరే అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమై ఆశించిన భూలాభం కలుగుతుంది.

5 / 6
కన్య: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడి సంచారం వల్ల ఈ ఏడాదంతా ఈ రాశివారు ఆదాయ వృద్ధికి, శుభ కార్యాలకు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో తప్పకుండా విదేశీ అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ అవకాశాన్నీ జారవిడుచుకోవద్దు.. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

6 / 6
మకరం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన శనీశ్వరుడు తృతీయ స్థానంలో సంచారం వల్ల కొద్ది ప్రయ త్నంతో ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి లాభం కలుగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us