2026 ఉగాది పంచాంగం : మేష రాశి ఫలితాలు!

Updated on: Mar 02, 2026 | 9:25 AM

2026 ఉగాది పండుగ వచ్చేస్తోంది. మార్చి 19న తెలుగు ప్రజలు అందరూ ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే పంచాగం వినడం. కాగా, ఇప్పుడు మనం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది. ఏ విధంగా కలిసిరానుందో చూద్దాం.

1 / 5
శ్రీపరాభవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి.  ఆర్థికంగా కలిసినప్పటికీ కొన్ని సమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారి ఆదాయ వ్యయాల విషయాలకి వస్తే  ఆదాయం 11, వ్యయం 5, రాజ పూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది.

2 / 5
వీరికి భాగ్యవ్యయాధిపతి అయిన గురుడు మూడు, నాలుగు స్థానంలో సంచరించడం, శని 12వ ఇంట సంచరించడం వలన సంపద పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ఈ రాశి వారు ఆగస్టు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రమాదాలు జరిగే అవకాశం, అనారోగ్య సమస్యలు, బంధు మిత్రులతో విరోధాలు వంటి సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. కష్టపడి పని చేస్తారు, కానీ శ్రమకు తగిన ఫలితం అందుకోలేరు. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకుంటుంది.  విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంది.

3 / 5
మేష రాశి స్త్రీలకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరాశి వారిపై శని ప్రభావం ఉండటం వలన అనేక సమస్యలు ఎదురు అవుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. అలాగే, భార్య భర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. కష్టపడి పనిచేసినా, చివరకు ఫలితం శూన్యంగా ఉంటుంది.  అదే విధంగా క్రిడా రంగంలో ఉన్నవారికి కూడా పరాభవ నామ సంవత్సరం నిరుత్సాహమే కలిగిస్తుందని చెప్పాలి.

4 / 5
మేష రాశి వారికి రాజకీయ నాయకులకు మొదట బాగున్నప్పటికీ, ద్వితీయార్ధంలో చాలా సమస్యలు ఎదురు అవుతాయి. కొందరు తమ పదవులను కోల్పోయే ప్రమాదం ఉంది. అధిక ధన వ్యయం అవుతుంది, విరోధాలు ఎక్కువ అవుతాయి. కాట్టి ఈ సంవత్సరం ఆచీ తూచీ అడుగు వేయడం చాలా మంచిది.  మేష రాశి వారికి  విద్యార్థులకు కాస్త బాగుందనే చెప్పాలి. కానీ ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారు చాలా జాగ్రత్తగా రాయడం మంచిది. కొన్ని సార్లు విజయం వరించకపోవచ్చు.

5 / 5
మేష రాశి వ్యాపారులు నష్టాలనే చవి చూస్తారు. పెట్టిన పెట్టుబడులకు లాభాలు రాకపోవడంతో చాలా నిరుత్సాహానికి గురి అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఉద్యోగులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అధికారుల వలన చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి, అక్టోబర్ తర్వాత మంచి జాబ్ లభించే అవకాశం ఉంది.

Follow Us