సూర్య గ్రహణం రోజే చంద్ర సంచారం.. వీరికి తీరని అప్పుల బాధలు!

Updated on: Feb 13, 2026 | 12:33 PM

2026లో మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 12న సంభవించబోతుంది. ఇక ఈ గ్రహణం అనేది అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 12 రాశులపై దీని ప్రభావం చూపుతుంది. అయితే సూర్య గ్రహణం రోజే అరుదైన సంఘటన చోటు చేసుకోనుంది. సూర్యగ్రహణం రోజున చంద్రుడు రెండు సార్లు సంచారం చేయనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరగా నాలుగు రాశుల వారికి కష్టకాలం అనే చెప్పాలి.

1 / 5
సూర్య గ్రహణం రోజు చంద్రుడు, ఉదయం 9 గంటలకు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. తర్వాత శతభిషా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. దీని వలన నాలుగు రాశుల వారికి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికంగా ఉండనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
మకర రాశి : మకర రాశి వారి ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈ రాశి వారు సీనియర్ల నుంచి ఒత్తి అధికారుల నుంచి మాటలు పడాల్సి వస్తుంది. కొన్ని సార్లు మీ ఉద్యోగమే మీకు విరక్తిని కలిగిస్తుంది. అంతే కాకుండా, శ్రమకు తగిన ఫలితం ఉండదు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నరాలకు సంబంధించిన సమస్యలు అధికం అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురు అవుతాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

4 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి సూర్య గ్రహణం రోజు చంద్రుడి సంచారం కారణంగా అనుకోని సమస్యలు ఎదురు అవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులు అధికం అవుతాయి. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అనుకోని ఆపదలు ఎదురు అవుతాయి.

5 / 5
మీన రాశి : మీన రాశి వారు అప్పు ఇవ్వడం, తీసుకునే విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులు మానసిక వేదనకు గురి చేస్తాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీ ఖర్చులను మరింత పెంచుతాయి. ఇంట్లో కలహాలు ఇబ్బందులకు గురి చేస్తాయి.