అద్భుతం.. మహా అద్బుతం.. ఆ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న నందా దీపం..

Edited By:

Updated on: Oct 05, 2026 | 12:32 PM

ఆరు నెలల పాటు మంచుతో బద్రీనాథ్ ఆలయం మొత్తం కప్పబడి ఉన్నప్పటికీ.. గర్భగుడిలోని జ్యోతి మాత్రం గుడి తెరిచే వరకు అలానే వెలుగుతుందని మీరు వినే ఉంటారు. తాజాగా అలాంటి విశేషమే రాజన్న సిరిసిల్లలో కనిపిస్తోంది. అవును, గంభీరావుపేటలోని శ్రీ సీతారామాలయంలో ఉన్న నందా అనే దీపం.. గత 700 ఏళ్లుగా వెలుగుతూనే ఆరని జ్యోతిగా భక్తులను ఆకట్టుకుంటోంది.

1 / 5
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామాలయం.. ఈ ఆలయంలో స్వామి వారి ముందు ఉన్న నందా అనే దీపం సుమారు 700 ఏళ్లుగా ఆరని దివ్య జ్యోతిగా భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ దీపం కేవలం ఒక వెలుగు మాత్రమే కాదు, శతాబ్దాల విశ్వాసానికి నిలువెత్తు ప్రతీక అనేది అక్కడి భక్తుల నమ్మకం. ఇదే ఆ గ్రామానికి ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచింది.

2 / 5
వివరాల్లోకి వెళ్తే.. క్రీస్తు శకం 1314వ సంవత్సరంలో కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు గుడిలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ఇక్కడ నందా దీపాన్ని ప్రతిష్ఠించారట. అప్పటి నుంచి నేటి వరకు ఈ దీపం ఆరకుండా ప్రకాశిస్తూనే ఉందట. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ దీపానికి నూనెను సమర్పిస్తూ దాని జ్వాల ఆరిపోకుండా చూసుకుంటున్నారట.

3 / 5
గ్రామస్థుల విశ్వాసం ప్రకారం ఈ జ్యోతి వెలుగుతుండటం వల్ల గ్రామంలో ఐశ్వర్యం, పంటలు, శాంతి నిలుస్తాయట. దీనిని దైవ అనుగ్రహానికి ప్రత్యక్ష రూపంగా గ్రామస్తులు భావిస్తారు. ఈ ఆలయ నిర్మాణం కేవలం భక్తి కట్టడం మాత్రమే కాదు, శిల్పకళా మహోన్నతికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆలయంలో 16, 18 రాతి స్తంభాలతో కూడిన అద్భుత మండపాలు, చతురస్రాకార నిర్మాణ శైలి, శిల్పాల్లో కనిపించే నిగూఢమైన నైపుణ్యం కనిపిస్తాయి. ఈ నిర్మాణం కాకతీయుల కాలపు కళాత్మక ప్రతిభను ప్రతిబింబిస్తూ, చరిత్రను సజీవంగా నిలబెడుతోంది.

4 / 5
ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. 9 రోజుల పాటు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, సీతారామ కళ్యాణం.. భద్రాచలం తరహాలో ఘనంగా అశ్వ, గజ, గరుడ, హనుమత్, శేష వాహన సేవలు, రథోత్సవం, ఏకాంత సేవ వంటివి జరుపుతారు. ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా హాజరవుతారు.

5 / 5
ఈ ఉత్సవాల సమయంలో దాతల సహకారంతో నిర్వహించే అన్నదానం ఈ ఆలయ ప్రత్యేకత. గ్రామస్థులు సమిష్టిగా భాగస్వామ్యం వహిస్తూ ప్రతి భక్తునికి సేవ చేయడం ఈ క్షేత్ర ఆధ్యాత్మికతను మరింత పెంచుతోంది. గత కొన్నేళ్లుగా గ్రామ ప్రజల సహకారంతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడం ద్వారా ఆలయం మరింత శోభాయమానంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us