Earthen Products: అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. ఆందోళన చెందుతున్న కుమ్మరిలు

| Edited By: Aravind B

Aug 28, 2023 | 7:13 PM

మట్టితో కుండలు తయారు చేయడం భారతదేశంలో పురాతన కాలం నాటి హస్తకళ. నాగరికత ప్రారంభం నుంచి మట్టికుండల వాడకం ఎక్కువగా ఉండేది. ప్రత్యేకంగా కుమ్మరి తయారు చేసిన పాత్రలను ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వినియోగిస్తుంటారు. గతంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన కుమ్మరి తయారు చేసిన పాత్రల స్థానంలో పలు రకాల లోహపు, పింగాణీ పాత్రలు రావడంతో మట్టిపాత్రలకు గిరాకీ లేకుండా పోయింది. వేసవికాలంలో కుండలు, కూజాలు... దీపావళి సమయంలో మట్టి ప్రతిమలు, ప్రమీదలు తయారు చేసేవారు.

1 / 5
మట్టితో కుండలు తయారు చేయడం భారతదేశంలో పురాతన కాలం నాటి హస్తకళ. నాగరికత ప్రారంభం నుంచి మట్టికుండల వాడకం ఎక్కువగా ఉండేది. ప్రత్యేకంగా కుమ్మరి తయారు చేసిన పాత్రలను ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వినియోగిస్తుంటారు. గతంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన కుమ్మరి తయారు చేసిన పాత్రల స్థానంలో పలు రకాల లోహపు, పింగాణీ పాత్రలు రావడంతో మట్టిపాత్రలకు గిరాకీ లేకుండా పోయింది.

2 / 5
వేసవికాలంలో కుండలు,  కూజాలు... దీపావళి సమయంలో మట్టి ప్రతిమలు, ప్రమీదలు తయారు చేసేవారు. పూల కుండీలతో పాటు ఇతర వంట పాత్రలను కూడా తయారు చేసేవారు. అప్పట్లో వీటికి గిరాకీ కూడా బాగానే ఉండేది. మారుతున్న పరిస్థితులతో పాటు పాత్రల వినియోగం, వాటి వాడకం పెరిగింది. ఫలితంగా రకరకాల మెటీరియల్స్‌తో పాత్రలు తయారు చేయడం ప్రారంభించారు. మట్టి పాత్రలను విస్మరించారు.

3 / 5
ప్రకాశంజిల్లా గిద్దలూరులో కుమ్మరి కులస్తులు ఎక్కువగా ఉన్నారు... గతంలో గిద్దలూరు ప్రాంతంలో కుమ్మరి వృత్తి వల్ల చేతినిండా పని ఉండేదని చెబుతున్నారు. గతంలో వేసవి వచ్చిందంటే పల్లెల్లోనూ, పట్టణాలలోనూ బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు పెద్ద పెద్ద కొండలతో చలివేంద్రం ఏర్పాటు చేసేందుకు తమ దగ్గరకు వచ్చేవారని తెలిపారు.

4 / 5
అయితే రానురాను మట్టి కుండల స్థానంలో ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫ్రిజ్‌లను వాడుతుండటంతో తాము తయారు చేసిన మట్టికుండలను కొనేవారు లేకుండా పోయారని వాపోతున్నారు. సామాన్య ప్రజలు గతంలో మట్టి కుండలలోనూ, కూజాలలోనూ నీటిని నిల్వ చేసుకునితాగేవారు. మట్టికుండలను పేదల ప్రిజ్ అని కూడా పేర్కొనేవారు. కానీ ఇప్పుడు ఫ్రిజ్‎లు, కూల్‌ క్యాన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో మట్టి కుండల వినియోగం తగ్గిపోయింది. దీపావళి వచ్చిందంటే ఇంటి ముంగిట వరుసగా మట్టి ప్రమిదలు పేర్చి నూనె దీపాలు వెలిగించే వారు. క్రమేణా కొవ్వొత్తులు, విద్యుద్దీపాలతో అలంకరణ చేస్తుండడంతో మట్టి ప్రమీదల ప్రాధాన్యత తగ్గిపోయింది.

5 / 5
మట్టివస్తువుల స్థానంలో ప్లాస్టిక్ వస్తువులు రావడం వలన పర్యావరణానికి హాని కలుగుతోంది. తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న తమ కులవృత్తి ప్రస్తుతం తమకు భారంగా మారిందని కుమ్మరులు వాపోతున్నారు. ప్రభుత్వాలు కల్పించుకుని పర్యావరణానికి హితమైన మట్టిపాత్రలను ప్రోత్సహించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతున్నారు.