నవరాత్రలు ప్రారంభం ముందు అస్సలే చేయకూడని పనులివే

Edited By:

Updated on: Oct 07, 2026 | 4:07 PM

నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజులు చాలా పవిత్రమైన రోజులు. అక్టోబర్ 11 నుంచి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ తొమ్మది రోజుల పాటు భక్తులు అమ్మవారిని నిష్టగా భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. నియమ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని కొలుచుకుంటారు.

1 / 5
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, నవరాత్రులకు ముందే  ఇంటి నుంచి కొన్న వస్తువులను తీసివేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. అమ్మవారి అనుగ్రహం కలిగి, అన్ని విధాలుగా కలిసి రావాలి అంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలంట. కాగా, నవరాత్రులకు ముందే ఇంటి నుంచి వేటిని తొలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
నవరాత్రుల సమయంలో చాలా మంది తమ ఇంటి వద్ద కలశాన్ని ప్రతిష్టించుకుంటారు. ప్రధాన ద్వారాన్ని అందంగా అలంకరించుకొని,  మామిడి లేదా అరటి ఆకులతో దండలను తయారు చేసి ఇంటి ప్రధాన ద్వారానికి కడుతుంటారు. అదే సమయంలో మీ ఇంటి ముందు ఒక రాగి చెంబులో నీటిని ఏర్పాటు చేసి, అదులో పసుపు, కుంకుమ వేసి, పువ్వులు వేయాలి. ఇలా తొమ్మిది రోజుల పాటు చేస్తూ ప్రతి రోజూ ఆ చెంబులోని నీరు, పువ్వులను మార్చాలి. ఇళా చేయడం వలన వాస్తు పరంగా కలిసి వస్తుందంట.

3 / 5
అంతే కాకుండా నవరాత్రులకు ముందు మీ ఇంటి చీపురును మార్చడం చాలా మంచిది అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కొంత మంది పాత చీపురు వాడుతుంటారు. అయితే నవరాత్రులకు ముందే దానిని తీసి వేసి, కొత్త చీపురును కొనుగోలు చేసి ఉపయోగించాలంట. దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

4 / 5
అదే విధంగా నవరాత్రులకు మందే మీ ఇంటి ముందు ఎండిపోయినా లేదా వాడిపోయిన మొక్కలు ఉంటే వాటిని తీసి వేయాలి. దర్వాజలకు వాడిపోయిన ఆకులు, పువ్వులు ఉంటే వాటిని తీసి వేసి కొత్తవి పెట్టాలి. ఇలా చేయడం వలన ప్రతి కూలత తొలిగిపోయి, మీ ఇంటిలో సానుకూలత పెరుగుతుందంట.

5 / 5
అంతే కాకుండా  పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలంట. నవరాత్రుల సమయంలో ఎప్పుడూ కూడా పూజ గది క్లియర్ చేసుకోకూడదు. నవరాత్రుల తర్వాత పూజగదిని శుభ్రం చేసుకొని, విరిగి పోయిన విగ్రహాలు, చిత్ర పటాలు ఉంటే వాటిని తీసి వేయాలని వాస్తు శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us