
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని ప్రసిద్ధ సారంగధరమెట్టపై వెలసిన శ్రీ బాలా త్రిపురసుందరి దేవి సమేత శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

రాజమహేంద్రవరంలోని సారంగధరమెట్టపై వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల చవితి పండుగ సందర్భంగా నాగసర్పం ప్రత్యక్షమైంది. పండుగ రోజున స్వామివారి ఆలయంలోకి నాగుపాము కనిపించడంతో అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు ఆశ్చర్యపోయారు

నాగుల చవితి రోజున స్వామివారి ఆలయంలో నాగసర్పం ప్రత్యక్షమవ్వడంతో భక్తులు ఎంతో విశేషంగా భావించారు. సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య సాన్నిధ్యంగా, అనుగ్రహంగా భావిస్తూ నాగసర్పానికి భక్తితో దండాలు పెట్టారు

ఈ ఘటనను భక్తులు సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య సాన్నిధ్యంగా, అనుగ్రహంగా భావించారు. నాగుల చవితి పండుగ రోజున స్వామివారి ఆలయంలో నాగసర్పం కనిపించడంతో ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపించారు.

అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగుల చవితి పర్వదినాన స్వామివారి ఆలయంలో పామును ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో చుట్టూ పక్కల ఊరి వాళ్ళకి ప్రత్యేక ఆసక్తిని కలిగించింది.