
ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ నిర్మాణం పూర్తయితే భారతదేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన అవుతుంది. ఈ వంతెన దక్షిణ ముంబైలోని సెవ్రీలో ప్రారంభమై ఎలిఫెంట్ ఐలాండ్‌కు ఉత్తరాన థానే క్రీక్‌ను దాటుతుంది. నవా షెవా సమీపంలోని చిర్లే గ్రామంలో ముగుస్తుంది.

ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన. దీని పొడవు 21.8 కి.మీ, ఇందులో 16.5 కి.మీ థానే క్రీక్ మీదుగా విస్తరించి ఉంది.

MMRDA హైవేపై గంటకు 100 కి.మీ వేగ పరిమితిని నిర్ణయించింది. తద్వారా ప్రయాణికులు 21.8 కిలోమీటర్ల దూరం వేగంగా ప్రయాణించవచ్చు.

ఆర్థోట్రోపిక్ స్టీల్ డెక్ టెక్నాలజీ. కాంక్రీట్ లేదా కాంపోజిట్ గిర్డర్‌లతో పోలిస్తే తక్కువ బరువు కలిగి ఉందని సమాచారం. కానీ బలమైన నిర్మాణంతో పోలిస్తే.. భారతదేశంలో మొదటిదిగా నిలుస్తుంది.

ఇక దీని నిర్మాణ అంచనా వ్యయం మొత్తం రూ.17,843 కోట్లు (US$2.2 బిలియన్లు)గా అంచనా వేయబడిన ఈ ప్రాజెక్ట్‌ను ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) అభివృద్ధి చేస్తోంది.

ఆగస్ట్ 2013లో MMRDA PPP విధానాన్ని ఉపయోగించకుండా ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ మరియు కన్‌స్ట్రక్షన్ (EPC) ఫ్రేమ్‌వర్క్‌పై ప్రాజెక్ట్‌తో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.

వంతెన నిర్మాణానికి 165,000 టన్నుల రీన్‌ఫోర్స్‌మెంట్ స్టీల్, 96,250 టన్నుల స్ట్రక్చరల్ స్టీల్ మరియు 830,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు అవసరం అంటున్నారు అధికారులు, నిర్వాహకులు.