ఏడాదిలో 15 రోజులు మాత్రమే.. మెట్టుగుట్టలో సూర్యకిరణాల అద్భుతం!

Edited By:

Updated on: Oct 02, 2026 | 10:29 AM

హనుమకొండ జిల్లా కాజీపేట ప్రాంతంలోని శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వర క్షేత్రంలో ఈ వింత ఆశ్చర్య పరుస్తోంది.. శివాలయం - రామాలయం ఒకేచోట ఎదురెదురుగా ఉంటాయి కాబట్టి రామలింగేశ్వర క్షేత్రం అంటారు..ఇక్కడ త్రేతాయుగం, ద్వాపరయుగం నాటి ఆనవాళ్లు చాలా కనిపిస్తాయి.. 55 ఎకరాల విస్తీర్ణం, 120 మీటర్ల ఎత్తులో గుట్టపై వెలసిన ఈ ఆలయానికి దక్షిణకాశీగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

1 / 5
అది మహత్యమా..! లేక మాటలకు అంతుచిక్కని ఇంజనీరింగ్ అద్భుతమా..! ఆ వింతచూసిన ఎవరికైనా ఆశ్చర్యం.. గూజ్ బామ్స్ తప్పవు.. ఏడాది వ్యవధిలో కేవలం బాద్రపదం మాసంలో మాత్రమే 15రోజుల పాటు కనిపించే సూర్యకిరణాల మహత్యం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.. ఆ కిరణాలు నేరుగా గర్భగుడిలోని స్వయంభూలింగంపై పడి ఆ లింగానికి పుణఃశక్తిని ప్రసాదిస్తుంది.. ఏడాదిలో కేవలం  15 రోజుల మాత్రమే సాక్షాత్కరించే ఆ వింత ఎక్కడ జరుగుతుంది..! ఆ గుడి మహత్యం..ఏంటి..! నిర్మాణంలో ఏదైనా విశిష్టత ఉందా..!

2 / 5
హనుమకొండ జిల్లా కాజీపేట ప్రాంతంలోని శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వర క్షేత్రంలో ఈ వింత ఆశ్చర్య పరుస్తోంది.. శివాలయం - రామాలయం ఒకేచోట ఎదురెదురుగా ఉంటాయి కాబట్టి రామలింగేశ్వర క్షేత్రం అంటారు..ఇక్కడ త్రేతాయుగం,, ద్వాపరయుగం నాటి ఆనవాళ్లు చాలా కనిపిస్తాయి.. 55 ఎకరాల విస్తీర్ణం, 120 మీటర్ల ఎత్తులో గుట్టపై వెలసిన ఈ ఆలయానికి దక్షిణకాశీగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నుండి కాశీ వరకు జలమార్గం ఉందని ప్రాచుర్యంలో ఉంది. ద్రాబాద్ నుండి వరంగల్ కు వచ్చే జాతీయ రహదారిపై వరంగల్ కు ముఖ ద్వారంలా.. ఎంట్రెన్స్ లోనే మడికొండ వద్ద ఈ ఆలయం ఉంటుంది. గుట్టపై రెండు ఎత్తైన శిఖరాలు కనిపిస్తాయి. రెండు వరసల్లో రాళ్ళను ఒకదాని పై మరొకటి పేర్చిన ఆనవాళ్లు కనిపిస్తాయి.. 168 మీటర్ల ఎత్తులో ఉండే వీటిని దొంతులమ్మ గుండ్లు అంటారు. బీముని బార్య హిడింబి గచ్చకాయలు ఆడుకుంటూ వీటిని ఇలా రెండు వరదల్లో పేర్చినట్లు చరిత్ర ప్రచారంలో ఉంది.

3 / 5
పడమర ముఖంగా వెలసిన ఈ శైవక్షేత్రంలో మాటలకు అంతుచిక్కని వింత ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈ గుడిలోని స్వయంభు శివ లింగాన్ని దర్శించు కోవాలనుకుంటే భక్తులు మూడు  ద్వారాలు దాటాలి.. గర్భగుడి ద్వారం అత్యంతి కిందకు ఉంటుంది. ఈ గుడికి అభిముఖంగా అతిపురాతన రామాలయం ఉంటుంది. రెండు గుడులు, మూడు ధ్వజ స్తంభాలు ఒకేచోట ఎదురెదురుగా ఉంటాయి. ఇక్కడ మాయో.. ఆ పరమేశ్వరుడి మహత్యమో లేక నిర్మాణంలో ఇంజనీరింగ్ అద్భుతమో ఏమో కానీ సూర్యకిరణాల మహత్యం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. సూర్యాస్తమయ సమయంలో నేరుగా సూర్య కిరణాలు గర్భగుడిలోని శివ లింగంపై వాలుతున్నాయి.
కేవలం బాద్రపదమాసంలో మాత్రమే 10 నుండి 15 రోజుల పాటు ఈ వింత కనువిందు చేస్తుంది. ఎదురుగా ఉన్న రామాలయం ఈ శైవక్షేత్రం కంటే ఎత్తులో ఉంటుంది.. ఈ శైవక్షేత్రానికి అభిముఖంగా తూర్పు వైపు ఉంటుంది. కానీ ఆ గుడి పై నుండి నేరుగా గర్భగుడిలోని స్వయంభూ లింగంపై సూర్య కిరణాలు పడడం అంతా శివుడి మహత్యమని బావిస్తున్నారు. డి ముందు దొంతులమ్మ గుండ్లు ఉంటాయి.. ఎవరో రెండు వారసల్లో రాళ్ళు పేర్చినట్లు కనిపిస్తాయి.హైద్రాబాద్ నుండి వరంగల్ సిటీకి ఎంట్రయ్యే ప్రతి ఒక్కరిని ఈ దొంతులమ్మ గుండ్లు ఆశ్చర్య పరుస్తాయి. ఆ రెండు దొంతులమ్మ గుండ్ల మధ్య నుండి సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలోని స్వయంభూ లింగంపై పడతాయి.

పడమర ముఖంగా వెలసిన ఈ శైవక్షేత్రంలో మాటలకు అంతుచిక్కని వింత ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈ గుడిలోని స్వయంభు శివ లింగాన్ని దర్శించు కోవాలనుకుంటే భక్తులు మూడు ద్వారాలు దాటాలి.. గర్భగుడి ద్వారం అత్యంతి కిందకు ఉంటుంది. ఈ గుడికి అభిముఖంగా అతిపురాతన రామాలయం ఉంటుంది. రెండు గుడులు, మూడు ధ్వజ స్తంభాలు ఒకేచోట ఎదురెదురుగా ఉంటాయి. ఇక్కడ మాయో.. ఆ పరమేశ్వరుడి మహత్యమో లేక నిర్మాణంలో ఇంజనీరింగ్ అద్భుతమో ఏమో కానీ సూర్యకిరణాల మహత్యం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. సూర్యాస్తమయ సమయంలో నేరుగా సూర్య కిరణాలు గర్భగుడిలోని శివ లింగంపై వాలుతున్నాయి. కేవలం బాద్రపదమాసంలో మాత్రమే 10 నుండి 15 రోజుల పాటు ఈ వింత కనువిందు చేస్తుంది. ఎదురుగా ఉన్న రామాలయం ఈ శైవక్షేత్రం కంటే ఎత్తులో ఉంటుంది.. ఈ శైవక్షేత్రానికి అభిముఖంగా తూర్పు వైపు ఉంటుంది. కానీ ఆ గుడి పై నుండి నేరుగా గర్భగుడిలోని స్వయంభూ లింగంపై సూర్య కిరణాలు పడడం అంతా శివుడి మహత్యమని బావిస్తున్నారు. డి ముందు దొంతులమ్మ గుండ్లు ఉంటాయి.. ఎవరో రెండు వారసల్లో రాళ్ళు పేర్చినట్లు కనిపిస్తాయి.హైద్రాబాద్ నుండి వరంగల్ సిటీకి ఎంట్రయ్యే ప్రతి ఒక్కరిని ఈ దొంతులమ్మ గుండ్లు ఆశ్చర్య పరుస్తాయి. ఆ రెండు దొంతులమ్మ గుండ్ల మధ్య నుండి సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలోని స్వయంభూ లింగంపై పడతాయి.

4 / 5
సూర్యాస్తమయ సమయంలో పడమరముఖంగా ఉన్న శివలింగంపై సూర్యకిరణాలు పడితే.. సూర్యోదయ సమయంలో ఈ గుడికి అభిముఖంగా ఉన్న రామాలయంలో రాములవారి విగ్రహంపై సూర్యకిరణాలు పడతాయి. కేవలం భాద్ర పదమాసంలో మాత్రమే కనిపించే ఈ వింత ఒక్కడి పూజారులు, భక్తులకు కూడా అంతు చిక్కడం లేదు.గర్భగుడిలో సూర్య కిరణాల స్పర్శతో ఆ శివలింగానికి పునః శక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.. సూర్య కిరణాల మహత్యం అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి పులకరించి పోతుంటారు..ఈ కొండా పైన మరో అబ్దుతం ఉంది.. 100 మీటర్ల ఎత్తు, 55 ఎకరాల విస్తీర్ణంలో ఈ గుట్ట ఉంటుంది.. ఈ గుట్టపై తొమ్మిది గుండాలు ఉంటాయి.. వాటిలో నిత్యం జలకళ కనిపిస్తుంది.. దేశమంతా కరువుచాయలు అలముకున్నా ఈ గుండాలలో మాత్రం నీళ్లు ఇంకిపోయిన చరిత్ర లేదు.. వీటిలో పాల గుండం, జీడిగుండం, కన్ను గుండం, కత్తి గుండం, రామపాద గుండం, బ్రహ్మ గుండం, పాండవుల గుండం, గిన్నె గుండం, గద్దె గుండం అనే తొమ్మిది గుండాలు నిత్యం జలకళతో ఉట్టి పడుతుంటాయి.

5 / 5
భాద్రపదమాసంలో సూర్యుడు దక్షిణాయన పథంలో పయనిస్తాడు.. ఆసమయంలో ఇక్కడ ఈ వింత కనిపిస్తుంది.. ఐతే చాళుక్యుల కాలం నాటికే మెట్టుగుట్ట క్షేత్రం ఎంతో ప్రాచుర్యం పొందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శిల్పరీతి, శాసనాలను బట్టిచూస్తే క్రీ.శ. 1198-1261 మధ్యకాలంలో కాకతీయుల కాలంలో మెట్టుగుట్ట మీద ఈ ఆలయాలను పునర్నిర్మానం చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఈ గుట్టపైన కనిపించే తొమ్మిది గుండాలలో కన్ను గుండం కాశీని అనుసంధానం చేస్తుందని నమ్మకం.. అందులో నాణెం వేసి విశ్వేశ్వరుడికి మొక్కితే కాశీకి వెళ్తుందని భక్తులు విశ్వసిస్తారు..  మెట్టుగుట్ట మీద 165 అడుగుల ఎత్తులో రెండు చూడముచ్చటైన జంట శిఖరాలు ప్రతిఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక శిఖరంలో అయిదు, మరో శిఖరంలో నాలుగు చొప్పున పెద్ద శిలలు ఒకదానిపైన ఒకటి పేర్చినట్టుగా ఉంటాయి.. ఎంతో విశిష్టతలు కలిగిన ఈ క్షేత్రం ఇప్పుడు కొత్తరూపు దిద్దుకుంటుంది. స్థానిక ఎమ్మెల్యే KR నాగరాజు చొరవతో బారీ రాజగోపురాలు, ఆలయ ప్రాకారాలు, ప్రదక్షిణ చేసుకునే వీలుగా బారీ నిర్మాణాలు చేపడుతున్నారు

Loading...
Unable to load recommendations.
Follow Us