
ఆ దేవాలయంలో ఉన్న చెట్టు ఆకులను ఆవు పాలలో కలిపిన ప్రసాదాన్ని మీరు తీసుకోగానే ఓ అద్భుతం జరుగుతుందని వందల ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. పూర్వకాలంలో శత్రువులు చేసిన విష ప్రయోగాన్ని కనుక్కునేందుకు కూడా దీన్ని ఒక ప్రామాణికంగా పాటించేవారంట. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉన్నదంటే?

కేరళలోని అలుప్పుల జిల్లాలోని చేతల దగ్గర తిరువిలా అనే ఆలయం ఉంది. దీని ప్రత్యేకతే వేరు. ఈ ఆలయంలో శివలింగం, నీలకంఠ తత్వం కలిగి ఉంటుంది. అంటే విషాన్ని దాచుకునే తత్వం కడుపులో ఉన్న విషాన్ని నాశనం చేయడమే అక్కడ పరిహారంగా చెబుతుంటారు. విష ప్రయోగాలు చేసిన ప్రయోగాలు జరిగిన వారు ఎవరైనా వెళ్ళవచ్చనే ది నమ్మకం.

ఆ దేవాలయంలో ఉన్న చెట్టు నుంచి తాజా ఆకులు తీసి ఆవు పాలల్లో కలిపి అది ఔషధంగా ఇస్తారు. అది తాగిన తర్వాత దాదాపుగా మూడు నుంచి ఐదు ప్రదక్షిణలు చేస్తే విష ప్రయోగం జరిగి ఉంటే ఆ దేవాలయం లోపల మీకు ఆటోమేటిక్ గా వాంతులు అయ్యి, ఆ విషం కడుపులో నుంచి బయటకు వచ్చేస్తుందంట. అందుకే చాలా మంది ఈ ఆలయానికి వెళ్లి విష ప్రయోగం జరిగిందో లేదో చెక్ చేసుకుంటారు.

ముఖ్యంగా విష ప్రయోగం జరిగింది అనుకున్న వారు తప్పకుండా, ఈ ఆలయానికి వెళ్లి ప్రసాదం తీసుకుంటారంట. కడుపులో ఉన్న విషాన్ని బయటకు పంపించే బెస్ట్ పరిహారం ఇదే అని అక్కడి వారి నమ్మకం.

ఇక్కడ ఇంకొక వింత కూడా ఉంది దేవాలయంలో మీకు ఒక రొటేటింగ్ పిల్లర్ కూడా ఉంటుంది. మీరు తిప్పితే తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా మీరు గమనించవచ్చు. ఆలయానికి వెళ్ళక ముందు మీరు చల్లటి పదార్థాలు తీసుకోకూడదు గోరువెచ్చని నీళ్లు మాత్రమే తీసుకోవాలి పరగడుపున మాత్రమే ఈ గుడికి వెళ్లాలి. ముఖ్యంగా, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు ప్రెగ్నెన్సీ వారు దేవాలయానికి వెళ్ళకూడదని చెబుతుంటారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.