మనీ ప్లాంట్....గాలిలోని ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి విషపదార్ధాలను తొలగించి గాలిని శుద్ధి చేస్తాయి. దీని వలన మీ గదిలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడం వలన మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. దీని వలన ఏకాగ్రత, ప్రొడక్టివిటీ పెరుగుతుంది.
మనీ ప్లాంట్‌ను ఎంతో సులభంగా పెంచుకోవచ్చు. నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. వివిధ లైటింగ్ పరిస్థితులలో సులభంగా పెరుగుతాయి. చైనా వాస్తు.. ఫెంగ్ షుయ్ ప్రకారం, మనీ ప్లాంట్ల్ పాజిటివ్ ఎనర్జీని, శ్రేయస్సును ఆకర్షిస్తాయి. మనీప్లాంట్ ను సంపద, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.
మనీ ప్లాంట్ పచ్చని ఆకులు చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తాయి. దీని వలన మీ గది ఎంతో అందంగా కనిపిస్తుంది. మనీ ప్లాంట్ ట్రాన్స్‌పిరేషన్ ద్వారా గాలిలో తేమ స్థాయిలను పెంచుతుంది, దీని వలన చర్మం పొడిబారడం, జలుబు మరియు దగ్గుతో పాటు శ్వాస సమస్యలు తగ్గుతాయి.
మనీ ప్లాంట్.. ఇది చాలా సాధారణ ఇండోర్ ప్లాంట్. దీన్ని ఇంట్లో పెంచుకుంటే అదృష్టం, సంపదలు చేకూరుతాయని చాలా మంది నమ్ముతారు. అయితే, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ, ఈ మనీ ప్లాంట్ కేవలం ఒక మొక్క మాత్రమే..దానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని ఎటువంటి ఆధారాలు లేవు. ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. అదనంగా, ఇది ఆర్థిక సమస్యలను తొలగిస్తుందని నమ్ముతారు.
మనీ ప్లాంట్ పెరగడం చాలా సులభం. దీనికి ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు. ఇది నీటిలో లేదా మట్టిలో పెంచవచ్చు. దీనికి ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం లేదు.. కాబట్టి నీడలో ఉంచడం మంచిది. క్రమం తప్పకుండా నీరు పెట్టండి. నేల ఎండిపోకుండా ఉంచండి. ఈ మొక్క యొక్క కొమ్మలను సులభంగా కత్తిరించి మరెక్కడైనా తిరిగి నాటవచ్చు.