కాణిపాకం బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా.. రూ.8.05 లక్షలకు గణనాథుడి లడ్డూ!

Edited By:

Updated on: Oct 05, 2026 | 9:13 AM

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసాయి. కాణిపాకం ఆలయంలో శాస్ట్రోక్తంగా జరిగిన ధ్వజా అవరోహణంతో నేటితో కాణిపాకం బ్రహ్మోత్సవాలకు అర్చకులు అధికారులు ముగింపు పలికారు. నిన్న రాత్రి జరిగిన తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సవాలు పరి సమాప్తం అయ్యాయి.

1 / 5

2 / 5
అంగరంగ వైభవంగా తెప్పోత్సవం జరగ్గా ప్రత్యేక ఉత్సవాల్లో 11వ రోజు రాత్రి తెప్పోత్సవం పై దర్శనమిచ్చారు విఘ్నేశ్వరుడు.
ఉత్సవ మూర్తులు సిద్ది, బుద్ధి వినాయకుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించగా స్వామివారి పుష్కరణి లో తెప్పలపై సిద్ధి, బుద్ధి సమేత వినాయకుడు విహరించారు.

అంగరంగ వైభవంగా తెప్పోత్సవం జరగ్గా ప్రత్యేక ఉత్సవాల్లో 11వ రోజు రాత్రి తెప్పోత్సవం పై దర్శనమిచ్చారు విఘ్నేశ్వరుడు. ఉత్సవ మూర్తులు సిద్ది, బుద్ధి వినాయకుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించగా స్వామివారి పుష్కరణి లో తెప్పలపై సిద్ధి, బుద్ధి సమేత వినాయకుడు విహరించారు.

3 / 5
 ఇక తెప్పోత్సవం లో పెద్ద సంఖ్యలో  భక్తులు పాల్గొన్నారు. ఇక కాణిపాకం బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు స్వామి వారి లడ్డును దేవస్థానం వేలం వేసింది. బ్రహ్మోత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించిన దేవస్థానం ఆలయం పోటు లో ప్రత్యేకంగా 21 కేజీల లడ్డూను తయారుచేసి వేలం వేసింది.

4 / 5

ఏటా బ్రహ్మోత్సవాల ముగింపులో ఆనవాయితీగా దేవస్థానం లడ్డూ వేలం నిర్వహిస్తోంది.స్వామి వారి లడ్డును సొంతం చేసుకునేందుకు పోటీపడ్డ భక్తుల్లో నెల్లూరుకు చెందిన ప్రసాద్ స్వామివారి లడ్డును దక్కించు కున్నారు.

5 / 5
రూ. 8.05 లక్షలకు 21 కేజీల గణనాధుడి లడ్డు ప్రసాదాన్ని  ప్రసాద్ సొంతం చేసుకున్నారు. గతేడాది 21 కేజీల లడ్డు ప్రసాదం రూ. 6.80 లక్షలకు వేలం ధర పలకగా ఈ ఏడాది రూ. 8.05 లక్షలు పలికింది.

Loading...
Unable to load recommendations.
Follow Us