కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదం ఇక ఏటీఎంలోనే.. క్యూలో నిలబడాల్సిన పనిలేదు!

Edited By:

Updated on: Sep 23, 2026 | 2:19 PM

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు కొత్త అనుభవం. ఇప్పటి వరకు ప్రసాదం కోసం క్యూలో నిలబడటం చూశాం.. కానీ ఇకపై ఏటీఎం మాదిరిగా ఆప్షన్ ఎంచుకుని, డిజిటల్‌గా డబ్బులు చెల్లించి లడ్డూ ప్రసాదం తీసుకునే సదుపాయం అందుబాటు లోకి వచ్చింది. అవును.. మీరు చదివింది నిజమే. కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదం కోసం ప్రత్యేకంగా వెండింగ్ మెషీన్ ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచే ఈ సదుపాయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది.

1 / 5

2 / 5
ఏటీఎంలో డబ్బులు తీసుకున్నట్టే.. ఇక్కడ లడ్డూలు..కొత్తగా ఏర్పాటు చేసిన మెషీన్‌ను చూస్తే అచ్చం ఏటీఎంలానే ఉంటుంది. భక్తులు మెషీన్‌లో తమకు కావాల్సిన ప్రసాదం బాక్స్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపు చేయాలి. చెల్లింపు పూర్తయ్యాక మెషీన్‌ నుంచి లడ్డూ ప్రసాదం పొందొచ్చు.. ఒక బాక్సులో 6 లడ్డూలు ఉంటాయి. రూ.100, రూ.200, రూ.300, రూ.400 విలువైన బాక్సులు అందుబాటులో ఉంటాయి. అంటే భక్తులు తమ అవసరానికి తగ్గట్టుగా ప్రసాదాన్ని ఎంచుకోవచ్చు. సిబ్బంది కోసం వెతకాల్సిన అవసరం లేదు..

3 / 5
ఈ వ్యవస్థలో మరో ప్రత్యేకత ఏంటంటే.. దేవస్థానం సిబ్బంది ప్రమేయం లేకుండానే భక్తులు ప్రసాదం తీసుకోవచ్చు. క్యూలో నిలబడి డబ్బులు చెల్లించడం.. ప్రసాదం కోసం సిబ్బందిని సంప్రదించడం వంటి ప్రక్రియను తగ్గించడమే దీని ఉద్దేశం. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఈ మెషీన్ ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే పండుగ రోజుల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో.. వెండింగ్ మెషీన్ ద్వారా ప్రసాదం పంపిణీకి పరిమితి విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ ప్రసాదం వెండింగ్ మెషీన్‌ను ప్రారంభించారు. సుమారు రూ.6 లక్షల ఖర్చుతో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఎక్కువగా వచ్చే దేవాలయాల్లో డిజిటైజేషన్, ఆటోమేషన్‌ను పెంచుతున్నామని.. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో తొలిసారిగా ప్రసాదం వెండింగ్ మెషీన్‌ను ప్రారంభించామని చెప్పారు.

ఈ వ్యవస్థలో మరో ప్రత్యేకత ఏంటంటే.. దేవస్థానం సిబ్బంది ప్రమేయం లేకుండానే భక్తులు ప్రసాదం తీసుకోవచ్చు. క్యూలో నిలబడి డబ్బులు చెల్లించడం.. ప్రసాదం కోసం సిబ్బందిని సంప్రదించడం వంటి ప్రక్రియను తగ్గించడమే దీని ఉద్దేశం. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఈ మెషీన్ ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే పండుగ రోజుల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో.. వెండింగ్ మెషీన్ ద్వారా ప్రసాదం పంపిణీకి పరిమితి విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ ప్రసాదం వెండింగ్ మెషీన్‌ను ప్రారంభించారు. సుమారు రూ.6 లక్షల ఖర్చుతో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఎక్కువగా వచ్చే దేవాలయాల్లో డిజిటైజేషన్, ఆటోమేషన్‌ను పెంచుతున్నామని.. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో తొలిసారిగా ప్రసాదం వెండింగ్ మెషీన్‌ను ప్రారంభించామని చెప్పారు.

4 / 5

ప్రసాదంతో ఆగకుండా.. దేవస్థానంలో సేవా టికెట్ల విషయంలోనూ ఆన్‌లైన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం 70 నుంచి 80 శాతం వరకు సేవా టికెట్లు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆర్జిత సేవా టికెట్ల విషయంలో భక్తులు థర్డ్ పార్టీ వ్యక్తులను నమ్మవద్దని సూచిస్తున్నారు. ఆన్‌లైన్ లేదా మనమిత్ర ద్వారా మాత్రమే టికెట్లు పొందాలని స్పష్టం చేస్తున్నారు.దసరా, ముఖ్యమైన పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ లక్షల్లో ఉంటుంది. ఒకవేళ లక్షన్నర మందికి పైగా భక్తులు వస్తే.. అందరికీ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని దేవాదాయ శాఖ కమిషనర్ తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యక్ష పూజలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

5 / 5

టెక్నాలజీని తీసుకురావడం మాత్రమే కాదు.. లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం, ప్రసాదం, సేవా టికెట్లను అందించడం ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.ఏదైనా తప్పు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని కూడా స్పష్టం చేశారు. ఇకపై ఇంద్రకీలాద్రిపై లడ్డూ కావాలంటే.. క్యూలో నిలబడటమే మార్గం కాదు. ఏటీఎం దగ్గరకు వెళ్లినట్టే.. వెండింగ్ మెషీన్ దగ్గరకు వెళ్లి, ఆప్షన్ ఎంచుకుని, యూపీఐలో చెల్లించి.. కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదంతో బయటకు రావచ్చు

Loading...
Unable to load recommendations.
Follow Us