వినూత్న గణనాథులు: 200 కేజీల కివీ ఫ్రూట్, 500 కేజీల జీడిపప్పుతో ప్రత్యేక వినాయక విగ్రహాలు!

Edited By:

Updated on: Sep 17, 2026 | 5:34 PM

వినాయక చవితి ఉత్సవాలు వస్తే చాలు.. దేశవ్యాప్తంగా ప్రతి వీధిలోనూ రకరకాల రూపాల్లో విఘ్నేశ్వరుడు కొలువుదీరుతాడు. అయితే ఈసారి కాకినాడ జిల్లాలో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలు మాత్రం అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణ స్పృహ, కళాత్మకత కలగలిపి భక్తులు రూపొందించిన కివి ఫ్రూట్ వినాయకుడు, జీడిపప్పు వినాయకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, స్థానికంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

1 / 5
కాకినాడ జిల్లాలో వినాయక చవితి వేడుకలు వినూత్న సృజనాత్మకతకు వేదికగా నిలిచాయి. నగరంలోని ఉల్లింకల వారి వీధిలో భక్తుడు టేకుమూడి పెదబాబు సుమారు 200 కేజీల డ్రై కివీ పండ్లతో ప్రత్యేక వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించగా, జమ్మిచెట్టు సెంటర్‌లో ఏకంగా 500 కేజీల జీడిపప్పుతో రూపొందించిన గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

2 / 5
200 కేజీల కివీ పండ్లతో ప్రసాద వినాయకుడు: కాకినాడలోని పెద్ద మార్కెట్ సాయి బాబా గుడి ఎదురుగా ఉన్న ఉల్లింకల వారి వీధిలో భక్తులు ఈ సృజనాత్మక వినాయకుడిని ప్రతిష్టించారు. సుమారు 200 కిలోల డ్రై కివీ పండ్లను ఉపయోగించి అత్యంత నైపుణ్యంతో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల జరిగే పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు, భక్తికి ఆత్మీయతను జోడించి ఈ విగ్రహాన్ని తయారుచేశారు.

3 / 5
నిమజ్జనం రోజున, ఆ తర్వాతి రోజుల్లో ఈ విగ్రహ తయారీకి ఉపయోగించిన 200 కేజీల కివీ పండ్లను భక్తులకు ఆరోగ్యకరమైన ప్రసాదంగా పంపిణీ చేయనుండటం విశేషం. ఈ వినూత్న వినాయకుడిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు.

4 / 5
మరోవైపు, కాకినాడ జగన్నాథపురం పరిధిలోని జమ్మిచెట్టు సెంటర్‌లో ఏర్పాటు చేసిన జీడిపప్పు వినాయక విగ్రహం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిర్వాహకులు ఏకంగా 500 కిలోల నాణ్యమైన జీడిపప్పును ఉపయోగించి ఈ గణపతి విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా రూపొందించారు. విగ్రహం ప్రతి అంగుళంలోనూ జీడిపప్పును అమర్చిన తీరు భక్తుల హృదయాలను ఆకట్టుకుంటోంది. సంప్రదాయం, కళాత్మకత ఉట్టిపడేలా ఉన్న ఈ ప్రతిమను చూడటానికి భారీగా జనాలు తరలివస్తున్నారు.

5 / 5
భక్తుల ఉత్సాహం - సెల్ఫీల కోలాహలం: కాకినాడలో ఇలా భిన్నమైన, ప్రకృతి సిద్ధమైన వస్తువులతో విగ్రహాలు తయారు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినూత్నంగా ఉన్న ఈ వినాయక విగ్రహాల వద్ద భక్తులు తమ సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి వెరైటీ వినాయకుల రూపకల్పనతో కాకినాడ జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us