iPhone 18 Pro: యాపిల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్స్‌తో ఐఫోన్ 18 సిరీస్.. లాంచింగ్ ఎప్పుడంటే?

Updated on: Jul 14, 2026 | 8:55 AM

ప్రపంచంలో అత్యధిక క్రేజ్ ఉన్న మొబైల్స్‌ యాపిల్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఈ సంస్థ ఎప్పటికప్పుడూ యూజర్స్ అభిరుచులకు తగ్గట్టు కొత్త కొత్త అబ్‌డేట్స్‌తో ప్రతి ఏడాది తన కొత్త మొడల్‌ మొబైల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. ఇటీవలే తెచ్చిన 17 సిరీస్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఇక 18 సిరీస్‌కు కూడా లాంచ్ చేసేందుకు యాపిల్ సిద్ధమైంది. అయితే ఎప్పిటిలాగే యాపిల్ తన లాంచ్‌ డేట్స్‌ను సీక్రెట్‌గా ఉంచుతున్నా.. తాజాగా ఇందుకు సంబంధించిన లీక్స్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి ఐఫోన్ 18 ఎప్పుడు లాంచ్ కాబోతుంది, దాని ధర ఎంత ఉండబోతుందో తెలుసుకుందాం.

1 / 6
యాపిల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సిరీస్ లాంచ్‌కు సమయం ఆసన్నమైంది. ఎప్పటిలాగే తన ఫేవరెట్ మంత్ అయిన సెప్టెంబర్ నెలలోనే యాపిల్ తన నెక్ట్స్ సిరసీ ఐఫోన్ 18ను లాంచ్‌ చేయబోతున్న కొన్ని నివేదికల ప్రకారం తెలుస్తోంది. యాక్యురేట్‌గా చెప్పాలంటే.. ఈ సెప్టెంబర్ 8 లేదా 9వ తేదీల్లో యాపిల్ తన వార్షిక ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లను లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇవి సెప్టెంబర్ 18 నుండి ఇవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

2 / 6
ఏ మోడల్స్ వస్తున్నాయి?: అయితే యాపిల్ ఈసారి యూజర్స్‌ కోసం ఓ కొత్త మోడల్‌ను పరిచయం చేయబోతుంది. అవును 18, 18ప్రోతో పాటు ఫోల్డబుల్‌ మోడల్‌ను కూడా యాపిల్ ఈ సారి మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో మాది కాకుండా  ఈసారి యాపిల్ తన లాంచ్ వ్యూహాన్ని కాస్త మార్చినట్టు. ఈ సెప్టెంబర్‌లో కేవలం ప్రో మోడల్స్, ఫోల్డబుల్ ఐఫోన్‌ను మాత్రమే విడుదల చేసి, ఇతర మోడల్స్ అయిన 18, 18e లను 2027 స్టార్టింగ్‌లో లాంచ్ చేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

3 / 6
డిజైన్, కలర్స్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా?: మీరు కొత్త 18 సిరీస్‌ డిజైన్‌లో ఏవైనా మార్పులు ఉంటాయని అనుకుంటే.. కచ్చితంగా ఇది మీకు నిరాషే. ఎందుకంటే యాపిల్ ఎప్పికటిలాగే తన పాత ఫ్లాట్-ఎడ్జ్ లుక్‌తోనే 18 సిరీస్‌ను కూడా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే బ్యాక్ కెమెరా సైజు మాత్రం కాస్త పెంచినట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఎక్కువ బ్యాటరీ, అప్‌గ్రేడెడ్ కూలింగ్ సిస్టమ్ కారణంగా ఫోన్ థిక్‌ నెస్, వెయిల్ కాస్త పెరిగే ఛాన్స్ ఉంది. ఇక రంగుల విషయానికి వస్తే.. ఈసారి సిగ్నేచర్ కలర్‌గా డార్క్ చెర్రీని తీసుకొస్తుంది యాపిల్, అలాగే  లైట్ బ్లూ, సిల్వర్, డార్క్ గ్రే రంగుల్లోనూ రానున్నాయి.

4 / 6
A20 ప్రో చిప్ - నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్: అయితే ఈ 18 సిరీస్‌లో యాపిల్ TSMC కంపెనీకి చెందిన అడ్వాన్స్‌డ్ 2nm ప్రాసెస్ సాంకేతికతతో తయారైన A20 ప్రో చిప్‌ను వాడుతోంది. ఇది స్పీడ్‌ను మరింత పెంచుతుంది. ఇది ఫోన్ వేగాన్ని, గేమింగ్ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, అత్యంత శక్తివంతమైన ఆన్-డివైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. దీని కారణంగా మీరు ఫోన్ యూజ్ చేస్తున్నట్టు క్విక్ యాక్షన్ ఉంటుంది.

5 / 6
కెమెరా, బ్యాటరీ :అయితే యాపిల్ 18 ప్రోలో సరికొత్త  వేరియబుల్ అపెర్చర్ లెన్స్‌ను వాడబోతుంది. ఇది లోలైట్‌లో కూడా మీకు మంచి క్యాప్ఛర్స్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. అలాగే మెరుగైన టెలిఫోటో లెన్స్, 24-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా తీసుకురానున్నారు. అలాగు  ఫోన్ సైడ్‌లో ఉంటే కెమెరా కంట్రోల్ బటన్‌ను పూర్తిగా ప్రెజర్-సెన్సిటివ్‌గా మారనుంది. ఇక ఈ సారి సిరీస్‌లో హైలెట్ ఏంటంటే అది బ్యాటరీ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సిరీస్‌లో 5,500mAh బ్యాటరీని యాపిల్ తీసుకురాబోతుంది.

6 / 6
భారత్‌లో ధరలు పెరిగే ఛాన్స్: పెరిగిన ధరలు, కొత్త 2nm చిప్, కెమెరా హార్డ్‌వేర్ కారణంగా ఈసారి ఐఫోన్ ధర రూ.5000వేల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లీక్స్ ప్రకారం, ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర సుమారు రూ. 1,39,900 గా ఉండగా, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ప్రారంభ ధర సుమారు రూ. 1,54,900 గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లు సరికొత్త iOS 27 సాఫ్ట్‌వేర్, సరికొత్త సిరి AI ఫీచర్లతో లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది.

Follow Us