
ISI మార్క్: హెల్మెట్ కొనుగోలు చేసేటప్పుడు ముందుగా చెక్ చేయాల్సింది దానిపై ISI మార్క్ ఉందో లేదో అని.. ISIతో పాటు ECE, DOT వంటి ఇతర భద్రతా ప్రమాణాలను కూడా చూడాలి. ఇవి హెల్మెట్ నాణ్యతను, ప్రమాదాల సమయంలో రక్షణ కల్పించే సామర్థ్యాన్ని సూచిస్తాయి. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే నాసిరకం హెల్మెట్లను కొనొద్దు.. ఎప్పుడూ నమ్మకమైన బ్రాండ్‌కు చెందిన, ISI మార్క్ ఉన్న హెల్మెట్స్ మాత్రమే కొనండి.

సైజ్: హెల్మెట్ ఎంత క్వాలిటీదైనా మన తలకు సరిగ్గా సరిపోకపోతే సరైన రక్షణ ఉండదు. కాబట్టి హెల్మెట్ కొనేటప్పుడు దాని సైజ్, ఫిట్టింగ్‌కు ప్రత్యేకంగా చూడండి. మీరు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు తలపై ఫిట్‌గా ఉండే వాటిని మాత్రమే తీసుకోండి.. అలా కాకుండా వదులుగా ఉండి సులభంగా కదులుతుంటే వాటిని కొనొద్దు. అలాగే ఎక్కవ ఫిట్ ఉండేది కూడా తీసుకోవద్దు.. దాని వల్ల అసౌకర్యం ఉండొచ్చు.

వైజర్ క్వాలిటీ: అలాగే మీరు కొనే హెల్మెట్ క్వాలిటీ ఎంత ముఖ్యమో దాని వైజర్ క్వాలిటీ కూడా అంతే ముఖ్యం. కాబట్టి హెల్మెట్ కొనేటప్పుడు వైజర్ నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించండి. మంచి నాణ్యత కలిగిన పాలికార్బోనేట్ వైజర్‌ను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా స్క్రాచ్ రెసిస్టెన్స్, యాంటీ ఫాగ్ వంటి ఫీచర్లు ఉన్న వైజర్ కలిగిన హెల్మెట్‌ను తీసుకోండి.

చిన్ స్ట్రాప్: హెల్మెట్ కొనుగోలు చేసేటప్పుడు చిన్ స్ట్రాప్ , లాక్ క్వాలిటీ కూడా చాలా ముఖ్యం. తలకు పెట్టుకున్న హెల్మెట్‌ను స్టిఫ్‌గా ఉంచడంతో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. లాక్ బలంగా ఉన్నప్పుడే పెట్టుకున్న హెల్మెట్ వదులుకాకుండా ఉంటుంది. హెల్మెట్ కొనేముందు దానిని ధరించి లాక్ వేసి సరిగ్గా ఫిట్ అయిందో లేదో పరిశీలించాలి. లాక్ వదులుగా ఉన్నా, పట్టీ సరిగ్గా బిగించకపోయినా అలాంటి హెల్మెట్‌ను కొనుగోలు చేయకూడదు.

మొత్తంగా హెల్మెట్ కొనుగోలు చేసేటప్పుడు కేవలం రంగు, డిజైన్, ధర మాత్రమే కాకుండా దాని నాణ్యత, సైజ్, వైజర్, లాక్ వంటి అంశాలను కూడా పరిశీలించాలి. సరైన హెల్మెట్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రయాణ సమయంలో తలకు రక్షణ కల్పించుకోవచ్చు. మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి హెల్మెట్ ఎంపిక విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదు.