Chinni Enni |
Dec 03, 2024 | 3:07 PM
ప్రస్తుత కాలంలో డయాబెటీస్ వ్యాధి ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డయాబెటీస్ వ్యాధి సోకే వారిలో ఎక్కువగా భారతీయులే అధికం. మారిన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా.. షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. డయాబెటీస్‌ను ఆహారాలతోనే మనం కంట్రోల్ చేసుకోగలం.
ఇలా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో గ్రీన్ మటర్ ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్‌తో బాధ పడే వారు ప్రతి రోజూ గ్రీన్ మటర్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో శరీరానికి ఉపయోగ పడే అనేక పోషకాలు ఉన్నాయి.
గ్రీన్ మటర్‌లో ప్రోటీన్ శాతం, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్కువగా తిన్నా త్వరగా కడుపు నిండుతుంది. కాబట్టి రక్తంలో షుగర్ లెవల్స్‌ని నియంత్రిస్తుంది. గ్రీన్ మటర్‌ని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే.
కూరల ద్వారా, సలాడ్స్, ఉడికించి కూడా తినవచ్చు. గ్రీన్ మటర్ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది.
గ్రీన్ మటర్ తరచూ తీసుకుంటే కేవలం డయాబెటీస్ మాత్రమే కాకుండా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలన్నీ మాయం అవుతాయి. కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)