
మహిళలు ఇష్టపడే దానిలో బంగారం ముదుంటుంది. ఇంటిలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే మగువలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. అయితే గతంలో బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడంతో చాలా మంది దీనిని కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదు. కానీ రీసెంట్గా బంగారం ధర తగ్గుతూ వస్తుండటంతో మళ్లీ మగువల మనసు స్వర్ణం వైపు మళ్లింది. గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

అయితే నవంబర్ 12 2026 గురువారం రోజున బంగారం ధర భారీగా తగ్గింది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. దీని ప్రభావం భారత మార్కెట్‌పై పై పడటంతో, ధరలు తగ్గు ముఖం పడుతున్నాయి.

గురువారం హైదరాబాద్ మార్కెట్లో ఉదయం 10 గంటల సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1 39,800 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28, 150 గా ఉంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,850గా ఉంది.

బుధ వారం రోజున 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,41,980 గా ఉండగా, నేడు 1 39,800 గా ఉంది. అంటే తులం బంగారం ధరపై రూ.2,180 తగ్గింది. అదే విధంగా నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,150గా ఉండగా నేడు 1,28, 150గా ఉంది. నేడు రూ. 2,000 తగ్గింది.

ఈ రోజు 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారంపై రూ. 218 రూపాయిలు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం పై రూ. 200 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.13980 ఉండగా, 22 క్యారెట్లు 12815గా ఉంది.