ఈ రోజుల్లో గ్యాస్ హార్ట్ బర్న్ అనేది ప్రతి ఒక్కరినీ వేదిస్తోన్న సాధారణ సమస్యగా మారింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. శీతాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది.
ఎందుకంటే శీతాకాలంలో ఆహారం జీర్ణం కావడంలో సమస్య ఉంటుంది. దీంతో తిన్న తర్వాత గొంతు, ఛాతీలో చికాకు, అసౌకర్యం మొదలైనవి సమస్యగా మారుతాయి. అటువంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలంటే ఈ కింది చిట్కాలు ఫాలో అవ్వాలి.
చలికాలంలో రోజుకు కనీసం 2 అరటిపండ్లు తినాలి. అరటిపండ్లు తినడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కడుపు శుభ్రంగా ఉంటే, జీర్ణ సమస్య ఉండదు. అంతే కాకుండా పాలు తాగడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఈ పాలు పొట్టలో గ్యాస్ట్రిక్ యాసిడ్ నియంత్రణలో సహాయపడుతుంది.
జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు దాల్చిన చెక్కను తినవచ్చు. దాల్చిన చెక్క జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగాలి. ఇది జీర్ణవ్యవస్థను సులభతరం చేస్తుంది. ఫెన్నెల్ వాటర్ తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో సోపును నానబెట్టి, ఖాళీ కడుపుతో ఉదయం తాగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య, గుండెల్లో మంట తొలగిపోతుంది. అదేవిధంగా జీలకర్ర నానబెట్టిన నీటిని తాగినా మంచి ఫలితం ఉంటుంది. జీలకర్రను రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, వడకట్టి ఉదయాన్నే తిగాలి.