
సూర్యకాంతి : ఎండాకాలంలో ప్రతి మొక్కకు నీరు చాలా అవసరం. అలాగే, సూర్యకాంతి కూడా ముఖ్యమని అస్సలు మర్చిపోకండి. కాబట్టి మీ ఇంట్లో పెంచే మొక్కలకు సూర్యరశ్మి తగిలేలా ఉంచండి.

నీరు పెట్టడం : వేసవి కాలంలో ఉదయం కానీ మధ్యాహ్నం కానీ మొక్కలకు నీరు పట్టాలి. ఇంకా వీటి చుట్టూ చెత్త వేస్తే ఇంకా తేమ ఆరిపోకుండా ఉంటుంది.

ఎరువులు : ఎండాకాలంలో వారంలో ఒకసారి అయినా ఎరువులు వేయండి. వాటిలో ఆవు పేడ మొక్కలను బలంగా ఉంచితుంది. అరటి తొక్కలు, టీ పొడి కూడా వేస్తే మొక్కలు పచ్చగా ఉంటాయి.

కుండీలు : మొక్కలను కుండీలలో పెంచేటప్పుడు చిన్న చిన్న రంధ్రాలు ఉండేలా చూసుకోండి. ఇలా చేస్తే మొక్కలు గాలినీ తీసుకుని తాజాగా కనిపిస్తాయి. కాబట్టి ఇది తప్పనిసరిగా ఉండాలి.

పురుగుల నివారణ: సమ్మర్లో పురుగులు పడి ఆకులు ఎండిపోతుంటాయి. అలాంటి సమయంలో వేప నూనె మొక్కల మీద స్ప్రే చేస్తే అవి తిరిగి మళ్ళీ చిగురిస్తాయి. అప్పుడు ఎండల్లో కూడా పచ్చగా కనిపిస్తాయి.