ద్వారకాతిరుమలలో అంగరంగ వైభవంగా చిన్న వెంకన్న తిరుకల్యాణ మహోత్సవం..

Edited By:

Updated on: Oct 26, 2026 | 9:40 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో చిన్న వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి అశ్వీయుజ మాస తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కనులపండువగా సాగింది. పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను స్వామివారు పరిణయమాడిన ఈ ఘట్టం భక్తులకు నేత్రపర్వంగా నిలిచింది. ఆలయ ఆవరం తూర్పు వైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికను రంగురంగుల పచ్చిపూలతో అత్యంత మనోహరంగా అలంకరించారు.

1 / 5

2 / 5
ఈ కల్యాణ మహోత్సవంలో భాగంగా పెళ్లికుమారుడిగా ముస్తాబైన శ్రీవేంకటేశ్వర స్వామి, పెళ్లికూతుర్లుగా అలంకరింపబడిన అమ్మవార్లు ఆలయం వద్ద నుండి ప్రత్యేక వేరువాహనాలపై కల్యాణ మండపానికి అశేష భక్తజన సందోహం మధ్య తోడ్కొని వచ్చారు. మండపంలో స్వామి అమ్మవార్లను వధూవరులుగా కొలువుదీర్చారు.ఈ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలయ అనువంశిక ధర్మకర్త ని వృతరావు, ఈవో వేంద్ర త్రినాధ రావు చేతుల మీదుగా స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

3 / 5
అనంతరం మంగళవాయిద్యాలు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముహూర్త సమయంలో వేద పండితులు చదివిన మంత్రాల మధ్య జీలకర్రబెల్లం మిశ్రమాన్ని స్వామి, అమ్మవార్ల శిరస్సులపై అర్చకులు ఉంచారు. ఆ వెంటనే జీలకర్ర బెల్లం ఉంచడం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర వైదిక కార్యక్రమాలను అత్యంత నిష్టతో పూర్తి చేశారు.

4 / 5
తదుపరి స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి, నీరాజన మంత్ర పుష్పాలు అందించారు. వేద విద్యార్థులు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు ఈ దివ్య కల్యాణాన్ని తిలకించి తరించారు. కాగా, తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సింహ వాహనంపై స్వామివారి గ్రామొత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉదయం సింహవాహనాన్ని అధిరోహించిన స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి గ్రామొత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, వేద మంత్రాల నడుమ సాగిన ఈ ఉత్సవంలో స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి గ్రామ పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

5 / 5
మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో కర్పూర హారతులతో స్వామివారికి నీరాజనాలు పలికారు. దివ్యదీపకాంతి తుల నుదుమ స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని భక్తులు దర్శించి పునీతులయ్యారు. కల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారు మోహిని రూపంలో కూడా భక్తులకు దర్శనమిచ్చి విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ యన్.వి. సుధాకర్ రావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, స్థానిక భక్తులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపను పొందారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us