అర్నబ్ తుఫాన్‌ ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు..

Updated on: Oct 29, 2026 | 6:59 AM

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా 11 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

1 / 5
అర్నబ్ తుఫాన్‌ అతలాకుతలం చేసింది. భారీగా పంట నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. విశాఖపట్నం సహా తీర ప్రాంతాలను తీవ్రంగా వణికించింది. తుఫాన్‌ ధాటికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరగగా.. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అయితే అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం ఇవాళ సాయంత్రం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే.. తీరం దాటిన అర్నాబ్ తుఫాన్ క్రమంగా బలహీన పడుతోంది. మధ్యాహ్నం తుపానుగా బలహీనపడిన అర్నబ్.. రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిలాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతోపాటు.. ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.

2 / 5
గురువారం: శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

3 / 5
కురిసిన భారీ వర్షాలతో ప్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగిపోర్లే వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. సహాయక చర్యల్లో  16NDRF, 11SDRF బృందాలు ఉన్నట్లు తెలిపారు.

4 / 5
ఈ నేపథ్యంలో అధికారులు 11 జిల్లాల్లోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. విజయనగరం, విశాఖ, అల్లూరి, ఏలూరు, పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ఉంటుందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో యథావిధిగా స్కూళ్లు తెరుచుకోనున్నాయి.

5 / 5
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవాకశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us