తక్కువ టైంలో చేసుకునే క్రిస్పీ అటుకుల వడలు..

Edited By:

Updated on: Oct 22, 2026 | 9:32 AM

తక్కువ సమయంలో అప్పటికప్పుడు చేసుకునే రుచికరమైన క్రిస్పీ అటుకుల వడలు. ఇడ్లీ, దోస పిండి లేనప్పుడు బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్‌గా ఇది మంచిది. ఇంకా ఇది లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా ఉండే ఈ వడలకు టేస్టీ టమాటా చట్నీ సరైన కాంబినేషన్. ఈ రెసిపీని ఈజీగా చేసేయొచ్చు

1 / 5
ముందుగా ఒకటిన్నర కప్పు అటుకులను తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అటుకుల ఉప్మాకు ఉపయోగించే అటుకులను తీసుకోవడం మంచిది. ఈ అటుకులను రెండు-మూడు సార్లు శుభ్రంగా కడిగి, రెండు టేబుల్‌స్పూన్ల నీళ్లు వేసి ఐదు-పది నిమిషాలు పక్కన పెట్టాలి. అటుకులు సాఫ్ట్‌గా నానిపోతాయి.

2 / 5
 నానిన అటుకులను చేతితో బాగా మెదిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే, మిక్సీ జార్‌లో వేసి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవచ్చు. అటుకుల టెక్స్చర్ మెత్తగా మాష్ చేసినట్లు ఉండాలి. మెదిపిన అటుకుల మిశ్రమంలో రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక టీస్పూన్ అల్లం ముక్కలు, రెండు టేబుల్‌స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర, అర టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు కలపాలి.

3 / 5
 వడలకు మంచి రావడానికి రెండు-మూడు టేబుల్‌స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. బియ్యప్పిండి లేకపోతే శనగపిండిని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు కొద్దికొద్దిగా పుల్లటి పెరుగును కలుపుతూ వడల పిండిని కలపాలి. ఒకటిన్నర కప్పు అటుకులకు సుమారు ముప్పావు కప్పు పెరుగు అవసరం కావచ్చు. ఈ విధంగా తయారు చేసిన వేడివేడి క్రిస్పీ అటుకుల వడలను, టేస్టీ టమాటా చట్నీతో కలిపి సర్వ్ చేసుకోవచ్చు.

4 / 5
పెరుగు పుల్లగా ఉంటే వడలు మరింత రుచికరంగా ఉంటాయి. పిండి వడలకు సరిపడా గట్టిగా, మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి.చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, పిండిని కొద్దికొద్దిగా తీసుకుని రౌండ్‌గా చేసి, మధ్యలో రంధ్రం చేయాలి. మధ్యలో రంధ్రం చేయడం వల్ల వడలు త్వరగా, సమానంగా వేగుతాయి.

5 / 5
డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను లోతులేని కడాయిలో వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక, మంటను మధ్యస్థంగా ఉంచి, సిద్ధం చేసుకున్న వడలను వేయాలి. వడలు విరిగిపోకుండా, వెంటనే తిప్పకుండా రెండు-మూడు నిమిషాలు ఒక వైపు వేగనివ్వాలి. కొంచెం గట్టిపడ్డాక మరో పక్కకు తిప్పి, రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తక్కువ మంటపై వేయిస్తే వడలు ఎక్కువ నూనె పీల్చుకుంటాయి, కాబట్టి మీడియం మంటపై వేయించడం ఉత్తమం. వేగిన వడలను టిష్యూ పేపర్ వేసిన ప్లేట్‌లోకి తీసుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us