49 సిక్సర్లు, 49 ఫోర్లు.. 655 పరుగులతో లెక్కలు తేల్చసిన ఐపీఎల్ సెన్సేషన్.. కట్‌చేస్తే..

Updated on: Sep 14, 2026 | 7:11 PM

Sher-E-Punjab T20 League 2026: షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్ 2026లో అమృత్‌సర్ సుర్మా జట్టు లుధియానా లయన్స్‌ను ఓడించింది. అయితే, ఈ టోర్నమెంట్‌లో ఐపీఎల్ సెన్సేషన్ నమన్ ధీర్ అత్యధిక పరుగులతో తోపు ప్లేయర్‌గా నిలిచాడు. మొత్తంగా 655 పరుగులతో బౌలర్ల భరతం పట్టాడు.

1 / 5
Sher-E-Punjab T20 League 2026: షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ 2026 మూడవ సీజన్‌ను అమృత్‌సర్ సుర్మా గెలుచుకుంది. ఫైనల్‌లో లుధియానా లయన్స్‌ను 8 వికెట్ల తేడాతో ఏకపక్షంగా ఓడించింది. అభిషేక్ శర్మ గైర్హాజరీలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన నమన్ ధీర్, టోర్నమెంట్‌లోనే స్టార్‌ ప్లేయర్‌గా నిలిచాడు. అతను తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు.

2 / 5
నమన్ ధీర్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 10 మ్యాచ్‌లలో 72.78 సగటుతో 655 పరుగులు సాధించాడు. అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ఉత్తమ బ్యాట్స్‌మెన్ అవార్డులు లభించాయి.

3 / 5
నమన్ ధీర్ బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నాడు. అతను కొట్టిన బౌండరీల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అతను ఈ టోర్నమెంట్‌లో అత్యధికంగా 49 సిక్సర్లు, అలాగే 49 ఫోర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 217.61గా ఉంది.

4 / 5
ప్రభసిమ్రన్ సింగ్ రెండవ స్థానంలో నిలిచాడు. అతను తొమ్మిది మ్యాచ్‌లలో 82.14 సగటుతో 575 పరుగులు చేశాడు. అతను 34 సిక్సర్లు, 57 ఫోర్లు కొట్టగా, అతని స్ట్రైక్ రేట్ 201.05గా ఉంది.

5 / 5
షేర్-ఎ-పంజాబ్ టోర్నమెంట్‌లో బ్యాట్స్‌మెన్ల ఆధిపత్యం చెలాయించినప్పటికీ, కుడిచేతి ఫాస్ట్ బౌలర్ సాహిల్ భాస్కర్ తన బౌలింగ్‌తో ప్రత్యేక ముద్ర వేశాడు. అతను 10 మ్యాచ్‌లలో అత్యధికంగా 20 వికెట్లు పడగొట్టాడు. అతడిని ఉత్తమ బౌలర్‌గా ప్రకటించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us