
కంప్యూటర్ రిమోట్ : ఒక వేళ మీకు ఎలక్ట్రానిక్స్‌పై ఆసక్తి ఉంటే ఈ పాత రిమోట్‌లోని సర్క్యూట్ బోర్డ్, ఇన్‌ఫ్రారెడ్ ఎల్ఈడీ వంటి భాగాలను గమనించి బేసిక్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవచ్చు. అలాగే సరైన IR రిసీవర్, కరెక్ట్ సాఫ్ట్‌వేర్ ఉంటే ఈ పాత రిమోట్‌తోనే కంప్యూటర్‌లో మీడియా ప్లేయర్‌ను ఆపరేట్ చేయొచ్చు. ఇది మీకు చాలా వరకు ఖర్చును తగ్గిస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్స్‌పై మీ నాలెడ్జ్‌ను పెంచుతుంది.

జ్యువెలరీ ఆర్గనైజర్: ఈ పాత రిమోట్లను టీవీలకే కాకుడా ఇంట్లోని సెక్యూరిటీ కెమెరాలు, సెట్-టాప్ బాక్స్‌లు లేదా మీడియా పరికరాలు కూడా వాడుకోచ్చు. ఎలా అంటే టీవీ రిమోట్లు ఈ ఉపకరణాల IR రిమోట్లను సపోర్ట్ చేసేలా ఉంటాయి. కాబట్టి మీ పాత రిమోట్ వీటికి సరిపోలితే, మెయిన్ రిమోట్ పాడైనప్పుడు వీటిని ఆల్‌టర్నేట్‌గా వాడుకోవచ్చు. అంతేకాదు రిమోట్‌లోని బటన్స్‌ను తీసేసి మీరు దాన్ని జ్యువెలరీ ఆర్గనైజర్‌గా కూడా వాడుకోవచ్చు. బటన్స్ తొలగించిన ప్లాస్టిక్ పౌచ్‌ను ఓ పలకకు అమర్చీ కమ్మలు, ఉంగరాలు, గొలుసులు భద్రపరుచుకునే స్టాండ్‌గా మార్చుకోవచ్చు.

పిల్లల క్రాఫ్ట్స్, బొమ్మలు: రబ్బరు బటన్లు, ప్లాస్టిక్ భాగాలతో చిన్న రోబోట్లు, రాకెట్లు, కార్లును కూడా తయారుచేయవచ్చు. వీటికి పదునైన అంచులు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు రిమోట్‌లోని బటన్స్ క్లీన్ చేసి బ్యాటరీ లేకుండానే కంట్రోల్ ప్యానెల్‌గా తయారు చేయవచ్చు. ఇంది పిల్లలు ఆడుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

అలాగే రిమోట్ పైభాగాన్ని శుభ్రం చేసి రంగు కాగితాలు లేదా స్టిక్కర్లతో అలంకరించి వాటిపై పెన్నులు, పెన్సిళ్లు పెట్టుకునే చిన్న డెస్క్ ఆర్గనైజర్‌గా వాడుకోవచ్చు. అలాగే దాన్ని ఓ జ్ఞాపకంగా కూడా వాడొచ్చు. మీ ఇంట్లో ఏళ్ల తరబడి వాడిన పాత టీవీకి సంబంధిచిన రిమోట్‌ను క్లీన్ చేసి ఒక బాక్స్‌లో ఉంచి భద్రపరుచుకోవచ్చు. అంతేకాదు రిమోట్‌కు ఉన్న బటన్స్‌ను కార్ట్ బోర్డుకు అతికించి అక్షరాలు, రోబోట్‌లను తయారు చేయొచ్చు.

ఒక వేల మీ పాత రిమోట్ మీకు అసలు ఎలాంటి పనికి రాదు అనుకుంటే దాన్ని నార్మల్‌గా చెత్తలో పడేయకుండా..ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రానికి ఇచ్చేయండి. అలాగే రిమోట్‌లోని బ్యాటరీలను బయటకు తీసి వాటిని ప్రత్యేక బ్యాటరీ డిస్పోజల్ కేంద్రాలకు ఇచ్చేయండి. కాబట్టి ఈ సారి మీ రిమోట్ పాడైతే అనవసరంగా పాడేయకుండా ఇలా ప్రయత్నంచండి.