Film News: విజయ్ సినిమాకు టైటిల్ ఖరారు.. కార్తి జపాన్ టీజర్ విడుదల..

| Edited By: Prudvi Battula

Oct 19, 2023 | 3:08 PM

ఖుషితో మరోసారి ఫ్యామిలీ జోనర్‌లోకి వచ్చేసారు విజయ్ దేవరకొండ. అఖండ, వీరసింహారెడ్డి లాంటి విజయాలతో జోరు మీదున్న బాలయ్య.. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. రీ-రిలీజ్‌ల ట్రెండ్‌ నెమ్మదిగా తగ్గుతుంది.. వాటిపై క్రేజ్‌ కూడా పడిపోయింది అనుకుంటున్న టైమ్‌లో ఏదో ఒక సినిమా వచ్చి మళ్లీ ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. భక్తిరస ప్రధానమైన వెబ్ సిరీస్ అందించడానికి 'ఆహా' ఓటీటీ రెడీ అవుతోంది. 

1 / 5
ఖుషితో మరోసారి ఫ్యామిలీ జోనర్‌లోకి వచ్చేసారు విజయ్ దేవరకొండ. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని ఈయనకు కాస్తో కూస్తో ఊపిరి ఊదింది ఈ చిత్రం. తాజాగా పరశురామ్ సినిమాకు ఫ్యామిలీ స్టార్ టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఇటు క్లాస్, అటు మాస్ ఆడియన్స్‌ను ఒకేసారి కవర్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా ఇంటి పనులు చేస్తూ.. అటు అభిమానులు కోరుకునే యాక్షన్ మిస్ కాకుండా టీజర్‌ను పర్ఫెక్టుగా కట్ చేసారు దర్శకుడు పరశురామ్.

2 / 5
అఖండ, వీరసింహారెడ్డి లాంటి విజయాలతో జోరు మీదున్న బాలయ్య.. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇదే జరిగితే 35 ఏళ్ళ తర్వాత బాలయ్య ఈ ఫీట్ సాధించినట్లు అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 1345 థియేటర్స్‌కు పైగానే రిలీజ్‌ అయింది. బిజినెస్ కూడా దాదాపు 70 కోట్ల వరకు జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ జోరు చూపిస్తున్నారు బాలయ్య.

3 / 5
జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తి హీరోగా నటిస్తున్న సినిమా జపాన్. వరస విజయాలతో జోరు మీదున్న కార్తి ఈ సినిమాతోనూ విజయం అందుకోవాలని చూస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఉంది. ఇందులో క్రేజీ దొంగగా నటిస్తున్నారు కార్తి. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్లో ఎస్ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

4 / 5
రీ-రిలీజ్‌ల ట్రెండ్‌ నెమ్మదిగా తగ్గుతుంది.. వాటిపై క్రేజ్‌ కూడా పడిపోయింది అనుకుంటున్న టైమ్‌లో ఏదో ఒక సినిమా వచ్చి మళ్లీ ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ఆ మధ్య ఈ నగరానికి ఏమైంది సినిమా టైమ్‌లో అంతే. తాజాగా మరో సినిమా కూడా వచ్చేస్తుంది. అదే శంకర్ దాదా ఎంబిబిఎస్. చిరంజీవి కెరీర్‌లో కల్ట్ కామెడీగా నిలిచిపోయిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేస్తున్నారు.

5 / 5
భక్తిరస ప్రధానమైన వెబ్ సిరీస్ అందించడానికి 'ఆహా' ఓటీటీ రెడీ అవుతోంది. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 20వ తేదీ నుంచి 'సర్వం శక్తిమయం' అనే టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్ అందించనున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయించారు. తాజాగా ఈ సిరీస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు మేకర్స్.