B Saroja Devi: అందం.. అభినయం.. మేళవించిన అద్భుత నటి బి.సరోజాదేవి ఇకలేరు!

Edited By: Rajeev Rayala

Updated on: Jul 14, 2025 | 1:31 PM

బి. సరోజా దేవి కన్నుమూశారు. అభినయ సరస్వతిగా పేరు తెచ్చుకున్న సరోజాదేవికి 87 ఏళ్లు. వృద్ధాప్య భారంతో ఆమె బెంగుళూరులోని సొంత ఇంట్లో కన్నుమూశారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఆమె నటిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన బి.సరోజాదేవి అనతికాలంలో తమిళ, తెలుగు, హిందీ సినిమాలతో పాపులర్‌్ అయ్యారు. రాజ్‌కుమార్‌, ఎంజీఆర్‌, శివాజీగణేశన్‌, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దిలీప్‌కుమార్‌తోపాటు అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడారు.

1 / 7

2 / 7
చిన్నతనంలో డ్యాన్స్ నేర్చుకున్న బి.సరోజా దేవి అప్పట్లో ఎక్కువగా నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆమె ముఖకవళికలు, హావభావాలు బావున్నాయని ఆమెను 'మహాకవి కాళిదాసు'లో తీసుకున్నారు హోన్నప్ప భాగవతార్‌. అలా చందన సీమలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్నారు. తమిళంలో ఎంజీఆర్‌తో చేసిన నాడోడి మన్నన్‌ అద్భుతమైన హిట్‌ అందుకుంది.

3 / 7
తెలుగులో పాండురంగ మహాత్మ్యంతో ఎంట్రీ ఇచ్చారు. భూకైలాస్‌, పెళ్లి సందడి, పెళ్లి కానుక, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేకవీరుని కథ, శ్రీ సీతా రామకల్యాణం, మంచీ చెడు, శ్రీ కృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, ప్రమీలార్జునీయం, శాకుంతల,భాగ్య చక్రం, ఉమాచండీ గౌరీ శంకరుల కథ, విజయం మనదే, మాయని మమత, పండంటి కాపురం, మనుషుల్లో దేవుడు, శ్రీ రామాంజనేయ యుద్ధం, సీతారామవనవాసం, దానవీరశూరకర్ణ, నిరీక్షణ, ఉగ్ర నాగు, యమధర్మరాజు, అల్లుడు దిద్దిన కాపురం, సామ్రాట్‌ అశోక లాంటి పాపులర్‌ తెలుగు సినిమాల్లో నటించారు.

4 / 7
ధైర్యానికి ప్రతీకగా బి.సరోజాదేవి గురించి చెప్పుకునేవారు. మొదటి నుంచీ పక్కా ప్రొఫెషనల్‌గా వ్యవహరించేవారు సరోజాదేవి. స్పాంటేనియస్‌ ఉన్న నటిగా ఆమెకు చాలా మంచి పేరుంది. సీన్‌కి తగ్గట్టు తనను తాను మలచుకుని, సెట్లో అందరితో సరదాగా ఉండే ఫ్రెండ్లీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. తాను ఏ భాషలో నటించినా ముందు ఆ భాషను పూర్తిగా నేర్చుకుని, డైలాగుల్ని సొంతంగా చెప్పుకునేవారు సరోజాదేవి. టాప్‌ ఆర్టిస్టులతో నటిస్తున్నా ఏమాత్రం గర్వం లేకుండా సెట్లో అందరితో సరదాగా ఉండేవారని పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి తరం సినిమా సెట్స్ లో ఉన్న సదుపాయాలు తమ కాలంలో లేవని, అయినా అందరూ ఆత్మీయంగా ఉండేవారమని పలు సందర్భాల్లో చెప్పారు బి.సరోజాదేవి.

5 / 7
నటీమణుల్ని అందంగా చూడటం జనాలకు అలవాటని, అందుకే తాను మేకప్‌ లేకుండా బయటకు రావడానికి ఇష్టపడనని ఓ సందర్భంలో చెప్పారు సరోజాదేవి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సమయంలో తన తల్లి పెట్టిన షరతులను చివరి వరకూ కంటిన్యూ చేశారు బి.సరోజాదేవి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్విమ్‌ సూట్‌లో కనిపించకూడదు, స్లీవ్‌ లెస్‌ టాప్స్ ధరించకూడదన్న తల్లి మాటలకు కట్టుబడ్డారు సరోజాదేవి. ఐదు భాషల్లో రెండు వందల సినిమాలకు పైగా నటించిన సరోజాదేవిని పలు పురస్కారాలు వరించాయి. తమిళ, కన్నడ రాష్ట్ర పురస్కారాలతో పాటు పద్మభూషణ్‌ అందుకున్నారు సరోజాదేవి.

6 / 7
సినిమాల్లో నటించడంతో పాటు వంటలు చేయడమంటే చాలా ఇష్టపడేవారు సరోజాదేవి. సెట్లో అందరూ కూర్చున్నప్పుడు ఇంటి నుంచి క్యారేజ్‌లు తీసుకొచ్చి పంచుకుని తిని, ఆత్మీయంగా ఉన్న ఆ రోజులు మళ్లీ రావన్నది ఆమె పదే పదే చెప్పిన మాట. ట్రెండ్‌కి తగ్గట్టు మనం కూడా మారాలన్నది సరోజాదేవి నమ్మిన సిద్ధాంతం. అందుకే యంగ్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా వెంటనే ఒప్పుకునేవారు. రెండు టీవీ షోలలోనూ ఆమె పార్టిసిపేషన్‌ ఉంది. 

7 / 7
సోషల్‌ మూవీస్‌లోనే కాదు, చారిత్రక, పౌరాణిక సినిమాల్లో నటించారు సరోజాదేవి. సినిమా ఇండస్ట్రీలో చోటుచేసుకున్న ఎన్నో మార్పులకు ఆమె ప్రత్యక్ష సాక్ష్యం. ప్రతి ట్రాన్స్ఫర్మేషన్‌ తనకి బాగా గుర్తుంటుంది.. సినిమా రంగంలో ఇన్ని మార్పులు చోటుచేసుకున్న సమయంలో తానుండటం అదృష్టమని ఆమె చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. సినిమా రంగంలో సరోజాదేవి చేసిన సేవలు చిరస్మరణీయమని చెబుతున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఆమె లేని లోటు భర్తీచేయలేనిదని... ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయేవారని గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.