Venky Atluri: ఒక్కోసారి ఒక్కో కాన్సెప్ట్‌.. సక్సెస్ బాటలో వెంకీ అట్లూరి..

Edited By: Prudvi Battula

Updated on: Apr 25, 2025 | 3:00 PM

ఇప్పుడున్న పరిస్థితుల్లో రొటీన్ స్టోరీ చేసి దర్శకుడిగా సక్సెస్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు.. అందుకే తెలుగులో ఓ దర్శకుడు ఒక్కో సినిమాకు ఒక్కో డిఫెరెంట్ పీరియడ్ నేపథ్యం తీసుకుంటున్నాడు. ఒక్కోసారి ఒక్కో కాన్సెప్ట్‌తో వస్తున్నాడు.. ఓసారి స్టడీస్, మరోసారి బ్యాంకింగ్.. ఇప్పుడేమో ఆటోమొబైల్ అంటున్నాడు. మరి అంత వింతగా ఆలోచిస్తున్న ఆ డైరెక్టర్ ఎవరు..?

1 / 5
వెంకీ అట్లూరి.. ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. తొలిప్రేమతో దర్శకుడిగా పరిచయమై హిట్ అందుకున్నారు ఈయన.. తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే అంటూ ఒకే జోనర్ సినిమాలు చేసారు. అయితే వరస ఫెయిల్యూర్స్ రావడంతో వెంటనే తన తప్పు తెలుసుకున్నారు వెంకీ.

2 / 5
అందుకే రూట్ మార్చారు.. డిఫెరెంట్ కాన్సెప్ట్స్ పట్టుకున్నారు.. వరస బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నారు వెంకీ అట్లూరి. పీరియడ్ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు వెంకీ. వరుసగా డిఫెరెంట్ కాన్సెప్ట్స్‎తో పీరియడ్ సినిమాలు చేస్తున్నారు.

3 / 5
ఈ క్రమంలోనే మూడేళ్ల కింద కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో చేసిన సార్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో కార్పోరేట్ విద్యారంగంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్. 

4 / 5
ఇక గతేడాది లక్కీ భాస్కర్ సినిమాలో బ్యాంకింగ్ సెక్టర్‌లో జరిగే స్కామ్స్‌ను చూపించారు.. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించింది.

5 / 5
తాజాగా సూర్యతో సినిమా ప్లాన్ చేస్తున్నారు వెంకీ. ఈసారి 80స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నేపథ్యంలో సినిమా చేయబోతున్నారు. ఇండియాకు ఫస్ట్ టైమ్ మారుతి కార్లు వస్తున్న సమయంలో జరిగే కథ ఇది. ఈ సినిమాకు ‘796CC’ టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో సూర్య యువ ఇంజనీర్‌గా కనిపించబోతున్నారు. మొత్తానికి విభిన్నమైన కథలతో తనదైన మార్క్ క్రియేట్ చేస్తున్నారు వెంకీ అట్లూరి.