Tollywood Updates: వాడివాసల్ మూవీకి సూర్య డేట్స్.. రెట్రో సెన్సార్‌ పూర్తి..

Edited By: Prudvi Battula

Updated on: Apr 19, 2025 | 3:19 PM

ఫైనల్‌గా వాడివాసల్ సినిమాకు డేట్స్ ఇచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న మూవీ ఆకాశంలో ఒకతార.  నటి మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది.  బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ మూవీ రాజా శివాజీ. సూర్య హీరోగా తెరకెక్కుతున్న పీరియాడియక్ రొమాంటిక్ యాక్షన్‌ డ్రామా రెట్రో.

1 / 5
ఫైనల్‌గా వాడివాసల్ సినిమాకు డేట్స్ ఇచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఆర్జే బాలాజీ మూవీతో పాటు వాడివాసల్‌ షూటింగ్ కూడా ప్యారలల్‌గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకుడు.

2 / 5
దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న మూవీ ఆకాశంలో ఒకతార. స్వప్నా సినిమాస్‌, గీతా ఆర్ట్స్ సమర్పణలో లైట్ బాక్స్‌ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.

3 / 5
నటి మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ పేజ్‌లో వెల్లడించారు. తన అకౌంట్‌ నుంచి మెసేజ్ చేసి ఎవరైనా డబ్బులు అడిగితే రెస్పాండ్ కావద్దని కోరారు. తనకు డబ్బు అసరమైతే స్వయంగా అగుతానేగానీ, సోషల్ మీడియాలో అడగను అంటూ ట్వీట్ చేశారు.

4 / 5
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ మూవీ రాజా శివాజీ. రితేష్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం నటీనటులు, డిజైనర్స్ కావాలంటూ టాలెంట్‌ హంట్ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేశారు మేకర్స్‌. ముఖ్యంగా టైటిల్ లోగో డిజైన్ చేసే ఆర్టిస్ట్‌లు కావాలంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు రితేష్‌.

5 / 5
సూర్య హీరోగా తెరకెక్కుతున్న పీరియాడియక్ రొమాంటిక్ యాక్షన్‌ డ్రామా రెట్రో. పూజ హెగ్డే హీరోయిన్‌. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యు బై ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్‌.