
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొదలు కుని సామాన్య జనాల వరకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ పండగను గ్రాంగ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో కూడా దీపావళి వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

తన భార్య, కుమారుడితో కలిసి దీపావళి పండగను గ్రాండ్ గా జరుపుకొన్నాడు దిల్ రాజు. ఇందుకు సంబంధించిన ఫొటోలను దిల్ రాజు భార్య తేజస్విని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

ఈ ఫొటోల్లో దిల్ రాజు ఫ్యామిలీ సంప్రదాయ దుస్తుల్లో ఎంతో క్యూట్ గా కనిపించింది. భార్య తేజస్విని, కుమారుడు అన్వి రెడ్డి కూడా ఎంతో అందంగా కనిపించారు. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా దిల్ రాజు ప్రస్తుతం నిర్మాతగానే కాకుండా తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మధ్యన ఇతర భాషా సినిమాలను కూడా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తాజాగా దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేసిన రామాయణ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లిపోతోంది.

ఇక ప్రస్తుతం రెండు సినిమాలను నిర్మిస్తున్నారు దిల్ రాజు. అందులో ఒకటి బలగం వేణు తెరకెక్కిస్తోన్న ఎల్లమ్మ. ఇందులో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది . త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎల్లమ్మతో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన అనే సినిమాను నిర్మిస్తున్నారు దిల్ రాజు. రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకుడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే ఈసినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.