జన నాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి.. ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్‌

Edited By:

Updated on: May 06, 2026 | 4:14 PM

తళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీ విజయం తర్వాత, అభిమానులు ఆయనను కేవలం నటుడిగానే కాకుండా నాయకుడిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, విజయ్ తదుపరి చిత్రం 'జననాయగన్' టైటిల్స్‌లో 'సీఎం దళపతి విజయ్' అని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళ రాజకీయాల్లో సినీ ప్రముఖుల ప్రవేశం, విజయ్ గత చిత్రాల రాజకీయ ప్రభావం వంటి అంశాలు ఈ విజ్ఞప్తికి బలం చేకూరుస్తున్నాయి. మేకర్స్ ఈ డిమాండ్‌ను ఎంతవరకు పరిగణిస్తారో వేచి చూడాలి.

1 / 5
తమిళ రాజకీయల్లో దళపతి విజయ్ సృష్టించిన సంచలనం ఇప్పుడు దక్షిణాది అంతటా హాట్ టాపిక్‌గా మారింది. కేవలం వెండితెరపైనే కాదు, ప్రజాక్షేత్రంలోనూ తిరుగులేని నాయకుడిగా విజయ్ నిరూపించుకున్నారు. తన పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) సాధించిన విజయంతో అభిమానుల సంబరాలకు హద్దు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ చేస్తున్న ఒక డిమాండ్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో రచ్చ చేస్తోంది.

2 / 5
సాధారణంగా ఒక హీరోకి సూపర్ స్టార్, మెగాస్టార్, దళపతి లాంటి బిరుదులు ఉండటం సహజం. కానీ విజయ్ విషయంలో పరిస్థితి వేరు. అభిమానులు ఆయనను కేవలం ఒక నటుడిగా మాత్రమే చూడటం లేదు, తమ కష్టాలను తీర్చే నాయకుడిగా కొలుస్తున్నారు. ఈ ఎన్నికల విజయం వారి నమ్మకాన్ని మరింత పెంచింది. అందుకే, ఆయన ఆఖరి చిత్రం జన నాయగన్ టైటిల్‌ కార్డ్‌ విషయంలో స్పెషల్ రిక్వెస్ట్ తెర మీదకు వచ్చింది. ఈ సినిమాలో టైటిల్స్‌లో విజయ్‌ పేరును 'సీఎం దళపతి విజయ్‌' అని వేయాలని కోరుతున్నారు అభిమానులు.

3 / 5
తమిళనాట సినిమా రాజకీయం ఎప్పుడూ కలిసే ట్రావెల్ చేస్తున్నాయి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి లెజెండ్స్‌ వెండితెర మీద ప్రూవ్ చేసుకున్న తరువాత ఆ అభిమానాన్ని తమ రాజకీయాలకు వారధిగా మార్చుకున్నారు. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తన పొలిటికల్ జర్నీకి చాలా ఏళ్లుగా రూట్‌ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు దళపతి. గత పదేళ్లుగా విజయ్ నటించిన ప్రతీ సినిమా సోషల్ ఇష్యూస్‌, పొలిటికల్‌ ఇష్యూస్‌ నేపథ్యంలోనే తెరకెక్కాయి. మెర్సల్‌, సర్కారు లాంటి సినిమాల్లో విజయ్‌ సంధించిన ప్రశ్నలు ఆ సినిమాల రిలీజ్‌ను కూడా ఇబ్బందుల్లో పడేశాయి.

4 / 5
 రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జన నాయగన్ సినిమా విషయంలోనూ తెర వెనుక చాలా కథ నడిచింది. విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీకి హెల్ప్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించారు. టైటిల్‌ నుంచే ఆ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు.

5 / 5
 కథా కథనాల్లోనూ విజయ్‌ని ఓ సేవియర్‌గా ప్రజా నాయకుడిగా చూపించారన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికల తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. త్వరలో జన నాయగన్ సినిమా రిలీజ్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. అందుకే ఆ సినిమా టైటిల్స్‌లో విజయ్‌ పేరును 'సీఎం దళపతి విజయ్‌' అని వేయమని కోరుతున్నారు. మరి ఈ డిమాండ్‌ను మేకర్స్‌ ఎంత వరకు కన్సిడర్ చేస్తారో చూడాలి.

Follow Us