వింటేజ్ హీరోలబ్బా.. ఆ లుక్కు చూస్తుంటేనే మతిపోతుందిగా..!

Edited By: Phani CH

Updated on: Jul 11, 2025 | 10:03 PM

90స్‌లో మన హీరోలు ఎలా ఉండేవాళ్లు.. అప్పట్లో వాళ్ల లుక్ చూసి పండగ చేసుకునే వాళ్లు అభిమానులు. ముఖ్యంగా చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీలను వింటేజ్ లుక్‌లో చూడాలని.. వాళ్లు అలాంటి సినిమాల్లో ఎంజాయ్ చేయాలని అభిమానులు కలలు కంటున్నారు. మన హీరోల మనసుల్లో కూడా అదే ఉంది. కాకపోతే కథలే సెట్ అవ్వట్లేదు.

1 / 5
అందుకే ఇప్పుడు తమతో సినిమాలు చేయడానికి వస్తున్న కుర్ర దర్శకులకు ఒకప్పటి తమ ఇమేజ్ గుర్తు చేసే కథలు సిద్ధం చేయాలని అడుగుతున్నారు. అయినా వాళ్లతో కొత్త కథలు చేయాలంటే సమస్య గానీ.. ఉన్న ఇమేజ్ వాడుకుంటూ సినిమాలు చేయమంటే ఈజీయే కదా..? అందుకే అదే చేస్తున్నారు మన దర్శకులు కూడా. స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినపుడు దర్శకులకు మామూలు ఎగ్జైట్‌మెంట్ ఉండదు.

2 / 5
అందుకే మరీ కొత్తదనానికి వెళ్లకుండా.. రిస్క్ తీసుకోకుండా.. సింపుల్‌గా వింటేజ్ లుక్స్ ఫాలో అవుతూ.. వాళ్ల బ్రాండ్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. అఖండ 2లో బోయపాటి చేస్తుంది ఇదే. మరోవైపు ఓజిలో సుజీత్.. ఉస్తాద్‌లో హరీష్ శంకర్ కూడా పవన్ వింటేజ్ లుక్ బయటికి తీసుకొస్తున్నారు. ఈ మధ్య బాలయ్య దర్శకులు వరసగా ఆయనలోని వింటేజ్ లుక్‌ బయటికి తెస్తున్నారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరికి అది బాగా హెల్ప్ అయింది. అఖండ 2కు ఇదే జరుగుతుంది.

3 / 5
వెంకటేష్‌లోని వింటేజ్ కామెడీ వర్కౌట్ అయితే ఎలా ఉంటుందో సంక్రాంతికి వస్తున్నాంతో చూపించారు అనిల్ రావిపూడి. తాజాగా చిరంజీవిలో ఉన్న కామెడీ టైమింగ్‌తో రప్ఫాడిస్తున్నారు ఈ దర్శకుడు.

4 / 5
ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ అంటూ ప్రయోగాలు చేసిన రవితేజ కూడా మాస్ జాతర కోసం పూర్తిగా వింటేజ్ లుక్‌లోకి మారిపోయారు. సామజవరగమనా సినిమాకు రైటర్‌గా పని చేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవితేజలోని ఎంటర్‌టైనింగ్ యాంగిల్ బయటికి తీసుకొస్తున్నారు. ధమాకా తర్వాత మరోసారి శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు రవితేజ.

5 / 5
దాదాపు పదేళ్ళ తర్వాత ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూపించిన ఘనత మారుతికే దక్కింది. తాజాగా విడుదలైన రాజా సాబ్ టీజర్ చూసి మురిసిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. పదేళ్లుగా వాళ్లు మిస్సైన ప్రభాస్ ఉన్నారిందులో. వింటేజ్ లుక్ వర్కవుట్ అయ్యాయి కాబట్టే.. రొటీన్ కథలతో వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, ధమాకా, సంక్రాంతికి వస్తున్నాం రప్ఫాడించాయి. అందుకే జై వింటేజ్ లుక్స్ అంటున్నారు మేకర్స్.