
ఒకప్పుడు మనం చూసిన కీర్తి సురేష్ ఇప్పుడు కనబడట్లేదు.. ఈమె వేరు.. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత కీర్తి మారిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. గ్లామర్ షోలో PhD పూర్తి చేసింది.

బేబీ జాన్ నుంచి నాన్ స్టాప్ గ్లామర్ షోతో నిద్ర లేకుండా చేస్తున్నారు కీర్తి. తాజాగా ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కవర్ పేజీపై కీర్తి పోజులు మామూలుగా లేవు.చూస్తున్నారుగా కీర్తి సురేష్ 2.0ను..! సినిమాల కంటే బయటే ఎక్కువగా గ్లామర్ షో చేస్తున్నారు కీర్తి.

మరోవైపు అనుపమ పరమేశ్వరన్ అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియా రెండింట్లోనూ రెచ్చిపోతున్నారు. టిల్లు స్క్వేర్‌తో ఈ బ్యూటీ ఇమేజ్ అంతా మారిపోయింది. మొదట్లో పక్కింటి అమ్మాయిలా కనిపించిన అనుపమ.. ఇప్పుడు గ్లామర్ క్వీన్ అయిపోయారు.

తెలుగమ్మాయి రితూ వర్మ కూడా మొదట్లో పద్దతిగా ఉన్నారు. కానీ రాను రాను ఈమె కూడా మారిపోయారు. ఆఫర్స్ కోసం అప్పుడుప్పుడూ గ్లామర్ షోలో హద్దులు దాటేస్తున్నారు.

సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ అప్‌లోడ్ చేస్తున్నారు. పక్కంటి అమ్మాయి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ సైతం బయట బాగానే గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు.